YS Jagan: గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్

  • IndiaGlitz, [Friday,January 12 2024]

ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగున్నాయి. దీంతో అధికార వైసీపీ గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహాలతో ముందకెళ్తోంది. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఇటు పరిపాలనతో పాటు అటు పార్టీ కార్యక్రమాలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓవైపు సంక్షేమ పథకాలు అందిస్తూనే మరోవైపు పార్టీ గెలుపుపై తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఎన్నికల కదనరంగంలోకి దూకారు. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు జాబితాల్లో కలిపి 51 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

5 ప్రాంతాల్లో క్యాడర్ మీటింగ్‌లు..

ఇక మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఈ నెలాఖరు లోపు ఖరారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి కాగానే వచ్చే నెల నుంచి ఎన్నికల కురుక్షేత్రంలోనే ఉండనున్నారు. మరోవైపు క్యాడర్‌కు దిశానిర్దేశం చేసే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 5 రీజియన్‌లలో క్యాడర్‌ మీటింగ్‌లను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో 4-6 జిల్లాలను కలిపి ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పార్టీ సభ్యులందరినీ ఏకం చేసి.. వారిలో చైతన్యం నింపనున్నారు.

విశాఖలో తొలి సమావేశం..

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించేలా కార్యకర్తలను సంసిద్ధం చేయడమే ఈ సమావేశాల ప్రధాన ఎజెండాగా చెబుతున్నారు. ఇందులో భాగంగా జనవరి 25వ తేదీన విశాఖపట్నం, భీమిలిలో తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సుమారు 3-4లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మిగిలిన 4 రీజియన్‌ల తేదీలను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. ఇలా ఒక్కో ప్రాంతంలో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

వైఎస్సార్ లాగే చరిత్ర సృష్టించేలా..

మొత్తానికి పార్టీ గెలుపే ధ్యేయంగా సీఎం జగన్ అడుగులు ముందుకు వేస్తున్నారు. మరోసారి అధికారంలోకి వచ్చి ప్రజలకు మంచి చేసేలా పక్కా స్ట్రాటజీతో వెళ్తున్నారు. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేసేలా ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా.. ఎన్ని కుట్రలకు తెరలేపినా మొక్కవోని ధైర్యంతో ప్రజలే అండగా బరిలో దిగుతున్నారు. ఉమ్మడి ఏపీలో జరిగిన 2009 ఎన్నికల్లో ఎలాగైతే విపక్షాలన్ని కలిసి వచ్చినా తన తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారో.. తాను కూడా అలాగే ప్రతిపక్షాల కుతంత్రాలను జయించి మరోసారి ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించాలనే సంకల్ప బలంతో ఉన్నారు.

More News

CM Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఇదే..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పది రోజుల పాటు ఢిల్లీ, విదేశాల పర్యటన చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఏఐసీసీ సమావేశంలో పాల్గొడంతో పాటు అగ్రనేతలతో భేటీ కానున్నారు.

Atal Setu: దేశంలోనే అతి పెద్ద వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ

ముంబయిలో దేశంలోనే అతి పెద్ద వంతెన 'అటల్ బిహారి వాజ్‌పేయి సెవ్రి- న్వశేవ అటల్ సేతు'ను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రారంభించారు. ముంబయి ట్రాన్స్‌ హార్బర్ లింగ్(MTHL)ను జాతికి అంకితం చేశారు.

వైసీపీ మూడో జాబితాలో బడుగు, బలహీన వర్గాలకు అగ్రతాంబూలం

సామాజిక న్యాయమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్.. అందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే వెనకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలతో ఎంతో మేలు చేస్తున్నారు.

పందెంకోడి వేలంలో సూపర్ ట్విస్ట్.. వేలం ఆపాలని ఓ వ్యక్తి విజ్ఞప్తి..

ఆర్టీసీ అధికారులు పందెంకోడిని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఓ వ్యక్తి ఆ కోడి తనదే వేలం ఆపాలని కోరాడు. అసలు ఇదంతా ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

Kalki 2898 AD Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సూపర్బ్ న్యూస్.. 'కల్కి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

'సలార్' హిట్‌తో మంచి జోరు మీదున్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న