YS Jagan: మడమ నొప్పిగా ఉన్నా.. వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
మిజాంగ్ తుఫాన్ హెచ్చరికలతో సీఎం జగన్ వెంటనే అప్రమత్తమై అధికారులను అలర్ట్ చేయడంతో స్వల్ప నష్టంతో ప్రజలు బయటపడ్డారు. కానీ వరద బాధితులను నేరుగా పరామర్శించలేకపోతున్నానని ఎక్కడో చిన్న బాధ సీఎం మనసులో ఉంది. అప్పటికీ మడమ నొప్పితో బాధపడుతున్నా సరే బాధితులకు నేనున్నాననే భరోసా కోసం కదిలివెళ్లారు. అధికారులకు తాను జారీ చేసిన ఆదేశాలు అమలవుతున్నాయా లేదా అనేది స్వయంగా తెలుసుకునేందుకు వెళ్లారు. అందుకే ఆయన జనం మెచ్చిన నాయకుడయ్యారు.
సాయం అందజేతపై ఆరా..
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి కొట్టుకుపోతే ఆ అన్నదాత కష్టం వర్ణనాతీతం. అందుకే ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తడిచిన ధాన్యాన్ని తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది కదా నాయకుడికి ఉండాల్సిన బాధ్యత. వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన సీఎం.. హెలలికాఫ్టర్ దిగుతూనే కలెక్టర్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఎంతమంది బాధితులకు రూ.2500 పరిహారం అందించారు.. ఎన్ని కుటుంబాల వారికి నిత్యావసరాలు అందజేశారని వాకబు చేశారు.
బాధితులకు తక్షణ సహాయం..
అంతే కాదు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినపుడు బాధితులను సహాయ కార్యక్రమాల గురించి ఆరా తీస్తానని చెప్పినట్లుగానే వారిని స్వయంగా కలిసి మాట్లాడారు. తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. వారి వినతులను ఆలకించి చలించిపోయారు. అవసరమైన వారికి తక్షణ సహాయం అందించారు. ఇద్దరు మహిళలకు లక్ష రూపాయల చొప్పున తక్షణ సహాయం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి జగన్ పబ్లిసిటీ కోరుకోరు. ప్రజా సమస్యలు తెలుకుంటానని 400రోజుల పాటు పాదయాత్రకు బయలుదేరిన లోకేష్ సగం రోజులకే చాపచుట్టేస్తున్నాడు. ఇది తండ్రికొడుకులకు ప్రజలపై ఉన్న శ్రద్ధ అని విమర్శలు వస్తున్నాయి. అదే సీఎం జగన్ మాత్రం ప్రజలకు ఏది చెబుతారో అదే చేస్తారని ప్రజలు కొనియాడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout