థర్డ్ వేవ్ భయాలు : ఏపీకి ‘‘ఊపిరి’’.. ఒకేసారి 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్లను సోమవారం జాతికి అంకితం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఆయన ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 100 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లపై 30 శాతం సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు.
ప్రతి ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ సౌలభ్యం వుంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఒక్కో ప్లాంట్‌లో నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని ఆయన తెలిపారు. అలాగే కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు.సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ విమానాల్లో తెచ్చుకోవాల్సిన పరిసస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం మనమే సొంతంగా ఆక్సిజన్ సరఫరా చేసే స్థాయికి చేరుకున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
రూ.20 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ క్రయోజనిక్ ఐఎస్‌ఓ కంటైనర్లు కొనుగోలు చేశామని.. రాష్ట్రవ్యాప్తంగా 24,419 బెడ్‌లకు ఆక్సిజన్ పైప్‌లైన్ల సౌకర్యం కల్పించనున్నామని సీఎం తెలిపారు. 74 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేశామని .. 163 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు జగన్ చెప్పారు. రాష్ట్రంలో 20 అత్యాధునిక ఆర్‌టీపీసీఆర్ వైరల్ (వీఆర్‌డీఎల్) ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని ... ఒమిక్రాన్ నేపథ్యంలో విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని.. దాదాపు 80 శాతం మందికి రెండు డోసులు ఇవ్వగలిగామని సీఎం పేర్కొన్నారు. ఇప్పటి వరకు 82 శాతం టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేశామని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments