CM Jagan:విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి కోరిన సీఎం జగన్

  • IndiaGlitz, [Wednesday,May 08 2024]

ఏపీలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోలింగ్‌కు ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీల అధినేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మే 13న పోలింగ్ అయిపోగానే అందరూ రిలాక్స్ కానున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, సీఎం జగన్‌ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 17 నుంచి ఫ్రాన్స్ ,స్విట్జార్లాండ్, యూకే వెళ్లేందుకు అనుమతి కావాలని నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. తొలుత కుటుంబంతో కలిసి ఇజ్రాయెల్‌లోని జెరూసలెం పర్యటనకు వెళ్లారు. అనంతరం అమెరికా పర్యటనకు వెళ్లారు. తర్వాత ఫ్యామిలీతో పాటు దావోస్ వెళ్లారు. పెట్టుబడుల సదస్సులో పాల్గొని .. అటు నుంచి విహారయాత్రను పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. గతేడాది మరోసారి లండన్ పర్యటనకు వెళ్లారు. ఆయన లండన్‌లో ఉన్నప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారు.

కాగా జగన్ అక్రమాస్తుల కేసుల్లో బెయిల్‌పై బయట ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ షరతుల్లో భాగంగా పాస్ పోర్టును కోర్టుకు సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కచ్చితంగా కోర్టు అనుమతి తీసుకుని.. కోర్టు దగ్గర ఉన్న పాస్ పోర్టు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే మే 13న పోలింగ్ ముగిసిపోతుంది. కౌంటింగ్ జూన్ 4న జరుగుతుంది. దీంతో మధ్యలో 20 రోజుల వరకూ సమయం ఉంది. అందుకే గత నెలన్నర రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జగన్.. కుటుంబంతో గడపాలని భావించారు. జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్‌లో చదువుకుంటున్నారు.

More News

Pawan:సోదరి భువనేశ్వరిని అవమానించిన వంశీని ఓడించండి: పవన్

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తనకు సోదరి లాంటి వారని జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌ తెలిపారు.

Sharmila:విదేశాలకు పారిపోతారు.. సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతిరెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ గెలుపు కోసం రంగంలోకి హీరోలు

ఏపీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్‌ పిఠాపునం నియోజకవర్గం వైపే అందరి చూపు ఉంది.

Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసా నిధుల పంపిణీకి ఈసీ బ్రేక్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.

Mahasena Rajesh:పవన్ కంటే జగన్ బెటర్.. మహాసేన రాజేష్ యూటర్న్..

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా టీడీపీ నేత మహానేత రాజేష్