సీఎం జగన్ మానసిక స్థితి సరిగా లేకే వ్యక్తిగత విమర్శలు.. పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలి: నాదెండ్ల
Send us your feedback to audioarticles@vaarta.com
మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ వేదికలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం పదవి స్థాయిని తగ్గించేలా అసభ్యపదజాలంతో మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. తక్షణమే పవన్ కల్యాణ్‌కు జగన్ క్షమాపణలు డిమాండ్ చేశారు. లేదంటే వీరమహిళలు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తారని హెచ్చరించారు.
మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా సీఎం మాట్లాడారు..
విమర్శలకు కూడా ఓ పరిధి ఉంటుందని.. ఇన్ని రోజులు జగన్‌కి బుద్ధి వచ్చి మారతారని సహనంతో ఉన్నామన్నారు. కానీ సీఎం మరింత దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వేదికలపై రాష్ట్రం గురించి వివరించాలని.. కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చేతకాని పాలనను కప్పిపుచ్చుకోవడానికి తమ అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. మహిళలను కించపరిచేలా, ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
మీలాగా వేల కోట్ల అక్రమ సంపాదన లేదు..
పవన్ కల్యాణ్ జీవన ఆధారం సినిమాలని.. అందుకే వీలైన సమయంలో షూటింగులు చేసుకుంటున్నారని తెలిపారు. మీలాగా పవన్ కల్యాణ్‌కు వేల కోట్ల అక్రమ సంపదన లేదని ఎద్దేవా చేశారు. మీలా అవినీతి చేసి సంపాదించడం లేదని.. షూటింగుల్లో తన స్వేదం చిధించి పన్నులు కట్టి సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. అధికారం ఉందనే అహంకారంతో రెచ్చిపోతున్న ముఖ్యమంత్రి, వైసీపీ నేతలకు ఇంకో ఐదు నెలలే సమయం ఉందన్నారు. వచ్చే టీడీపీ-జనసేన ప్రభుత్వంలో వైసీపీ నేతల ఆగడాలకు తగిన గుణపాఠం చెబుతామని నాదెండ్ల వార్నింగ్ ఇచ్చారు.
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ మరో కట్టుకథ..
టోఫెల్ శిక్షణ పేరుతో పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల్లోకి వెళ్లే దమ్ములేక ఎమ్మెల్యేల చేత బస్బు యాత్ర చేయిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మాత్రం హెలికాప్టర్లో తిరుగుతూ ప్రతిపక్షాలను తిట్టడానికి ప్రజాధనం దర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు.ఇన్నిరోజులు రిషికొండను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పిన వైసీపీ నేతల అసలు స్వరూపం ఇప్పుడు బయపడిందన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం కోసమే రిషికొండకు గుండు కొట్టారనే వాస్తవం చీకటి జీవోతో తేలిపోయిందన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ మరో కట్టుకథ తెరమీదకు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నారా లోకేష్ భేటిని స్వాగతిస్తున్నామని నాదెండ్ల వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout