CM Jagan:విజయదశమి రోజున విశాఖకు షిఫ్ట్ కానున్న సీఎం జగన్.. ముగ్గురు సభ్యులతో కమిటీ

  • IndiaGlitz, [Thursday,October 12 2023]

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన జగన్.. అక్కడి నుంచి పరిపాలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయం మార్పునకు పనులు చకచక జరిగిపోతున్నాయి. అక్టోబర్ 24న విజయదశమి పండుగ రోజున సీఎం ఆఫీస్ విశాఖకు తరలించనున్నారు. క్యాంప్ కార్యాలయ తుదిదశ నిర్మాణ పనులు వేగవతం చేశారు. క్యాంప్ కార్యాలయం తరలింపు పనులను పర్యవేక్షించడానికి ముగ్గురు అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో పరిపాలన రాజధానిగా విశాఖ..

ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ప్రభుత్వ సీనియర్ అధికారులు విశాఖపట్నంలో బస చేయడానికి తగిన వసతిని గుర్తించేందుకు ఈ కమిటీ ఏర్పాటైంది. మున్సిపాలిటీ- పట్టణాభివృద్ధి, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఇందులో సభ్యులుగా ఉన్నారు. క్యాంప్ కార్యాలయ తరలింపు ఏర్పాట్లను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. దసరా నుంచి విడతల వారిగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు షిఫ్ట్ అవుతాయి. డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మారనున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 16న విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ప్రారంభం..

మరోవైపు ఈ నెల 16వ తేదీ సీఎం జగన్ విశాఖలో పర్యటించనున్నారు. రిషికొండ ఐటి హిల్స్‌లో నూతనంగా ఏర్పాటైన ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను ప్రారంభించనున్నారు. దీంతో ఆ రోజు నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించనుంది. విశాఖ పరిసరాల ప్రాంతాల్లో వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగులు ఇక ఈ క్యాంపస్ నుంచే పనిచేయనున్నారు. ప్రస్తుతం రిషికొండలో నిర్మిస్తున్న సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణం తుదిదశకు చేరుకుంది. జగన్ సీఎం అయిన దగ్గరి నుంచి అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో నివసిస్తున్న విషయం విధితమే. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచే ఆయన పరిపాలన సాగిస్తున్నారు.

More News

Nagababu:బిగెస్ట్ డెవిల్స్‌తో యుద్ధం చేస్తున్నాం.. కలిసి పోరాడి వైసీపీని గద్దె దించుద్దాం: నాగబాబు

బిగెస్ట్ డెవిల్స్‌తో మనం యుద్ధం చేస్తు్న్నామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు తెలిపారు.

Chandrababu:టీడీపీ చీఫ్ చంద్రబాబుకు మరోసారి నిరాశే.. స్కిల్ కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

Jagananna Colony: రాష్ట్రానికి గృహ శోభ.. అక్కాచెల్లెమ్మలకు అన్నగా అండగా సీఎం వైయస్ జగన్

రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలబడ్డారు. ప్రతి చెల్లీ, ప్రతి అక్కా సొంత ఇంట్లో ఆత్మగౌరవంతో జీవించాలని ఆయన సంకల్పించారు.

Bigg Boss 7 Telugu : అశ్వినిని నలిపేసిన అమర్‌దీప్ .. ప్రశాంత్ కెప్టెన్సీ గోవిందా, రైతుబిడ్డ కంటతడి

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో సందడి పెరిగింది.

Lokesh:రెండో రోజు ముగిసిన సీఐడీ విచారణ.. సమయం వృథా చేశారని లోకేశ్ ఆగ్రహం

తాడేపల్లి సీఐడీ కార్యాలయంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో రోజు విచారణ ముగిసింది.