CM Jagan:విశాఖ అగ్నిప్రమాదం వెనక ప్రతిపక్షాల కుట్ర.. విచారణకు సీఎం జగన్ ఆదేశాలు..

  • IndiaGlitz, [Monday,November 20 2023]

అందమైన సాగర తీరమైన విశాఖ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలించారు. అయితే ఈ ఘటన వెనుక ప్రతిపక్షాల కూటమి టీడీపీ-జనసేన పార్టీల హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటనలు జరగలేదని స్థానికులు చెబుతున్నారు. విశాఖపట్నంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా చేయడానికి ఉద్దేశపూరకంగానే ఆ రెండు పార్టీలకు చెందిన నాయకులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకు తరలించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

డిసెంబర్‌లో అక్కడి నుంచి పరిపాలన చేసేందుకు అన్ని ఏర్పాట్లు తుది దశకు చేరాయి. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా ఉండే విశాఖలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా కుట్రలకు తెరలేపారని స్థానికులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వెంటనే ఇందుకు కారణమైన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్లాన్స్ చేస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

More News

Lokesh:లోకేష్ పాదయాత్ర పున:ప్రారంభం.. ప్లాన్‌లో మార్పులు..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) తిరిగి ప్రారంభం కానుంది.

Leo:'లియో' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'లియో' సినిమా దసరా కానుకగా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Fire Accident: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

Bigg Boss Telugu 7 : ఈ వారం నో ఎలిమినేషన్ .. నెక్ట్స్ వీక్ ఇద్దరు ఇంటికే , మరిన్ని ట్విస్టులు ఖాయం

బిగ్‌బాస్ 7 తెలుగు ఉల్టా పల్టా సీజన్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ముందుకు సాగుతోంది.

Calling Sahasra:సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర’.. డిసెంబర్ 1న రిలీజ్

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు