CM Jagan:రూ.25లక్షల వరకు వైద్యం ఉచితం.. సీఎం జగన్ మరో శుభవార్త..

  • IndiaGlitz, [Wednesday,December 13 2023]

రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ మరో శుభవార్త అందించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకూ ఉచితంగా వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయమని.. డిసెంబర్ 18 నుంచి రూ.25లక్షల వరకూ ఉచితంగా వైద్యం అందించాలని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుందన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకున్న వారికి డాక్టర్ చెకప్ కోసం రవాణా ఛార్జీల కింద రూ.300 సైతం చెల్లించాలని సూచించారు.

వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అన్న దానిపై రూపొందించిన వీడియోను అందరికీ పంపించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య శ్రీ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకునేలా చూడాలని సమీక్షా సమావేశంలో ఆయన సూచించారు. ఆరోగ్యం, విద్య అనేవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలని.. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని ఆయన గుర్తుచేశారు. అందుకే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసిందని వివరించారు. పేద ప్రజలకు ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలని పేర్కొన్నారు.

ప్రతి మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. జనవరి నెలాఖరు నాటికి దీనిని పూర్తిచేయాలని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం ఎలా పొందాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. ఈ ప్రచారంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించారు. ఇక ఫేజ్-2 ఆరోగ్య సురక్షను జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించాలన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలని సూచించారు. అలాగే డయాలసిస్‌ రోగులు వాడుతున్న మందులు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ సూచించారు.

More News

Drugs Issue: డ్రగ్స్ వ్యవహారంలో సినీ ఇండస్ట్రీకి హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. ఇందులో భాగంగా తనదైన టీమ్‌ను తయారుచేసుకుంటున్నారు.

Mallareddy:మాజీ మంత్రి మల్లారెడ్డిపై చీటింగ్ కేసు నమోదు

మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది.

Bhatti Vikramarka:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ అధికారిక నివాసంగా ఉండేది.

Parliament: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్

అత్యాధునిక సౌకర్యాలు, అత్యంత పటిష్టమైన భద్రత ఉండే పార్లమెంట్‌లో ఈ స్థాయి భద్రతా వైఫల్యం జరగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అడుగుడుగునా సెక్యూరిటీ, ఢిల్లీ పోలీసులు

Lok Sabha: లోక్‌సభలో తీవ్ర భద్రత వైఫల్యం.. సభలోకి ప్రవేశించిన ఆగంతకులు..

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో తీవ్ర భద్రత వైఫల్యం చోటుచేసుకుంది. లోక్‌సభ జరుగుతున్న సమయంలో విజిటింగ్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు ఆగంతకులు సభలోకి ఒక్కసారిగా ప్రవేశించారు.