CM Jagan:క్రేజ్ కా బాప్.. ఎన్నికల వేళ సంచలనంగా సీఎం జగన్ ఇంటర్వ్యూ..
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం జగన్‌కు ప్రజల్లో ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి రుజువైంది. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు జగన్ టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఏపీ రాజకీయాల్లో గేమ్‌ఛేంజర్‌గా మారింది. టీవీ-9లో జగన్ ఇంటర్వ్యూను లైవ్‌లో అత్యధికంగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాంతో పాటు యూట్యూబ్‌లోనూ లక్షల మంది చూశారు. ముఖ్యమంత్రి జగన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. గత ఐదేళ్లలో ఏం చేశానో, మళ్లీ అధికారం ఇస్తే ఏం చేయబోతున్నానో ఒక్కో అంశాన్ని చాలా చక్కగా వివరించారు. దీంతో జగన్ ఏం చెప్తాడో వినాలని ప్రజలు ఆసక్తి చూపారు
అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమం వంటి అనేక విషయాల గురించి క్లియర్ కట్‌గా చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో తన పథకాల లబ్దిదారులు 50 శాతానికి పైగా ఉన్నారని వెల్లడించారు. జూన్ 4 తరువాత సీఎంగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. దాంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చిన పంచ్ జనంలో బాగా పేలింది. ఒకసారి తప్పు చేస్తే పొరపాటు...రెండో సారి చేస్తే గ్రహపాటు.... మూడు నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్లాయి.
దీంతో ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన కొన్ని అంశాలు.. పాయింట్స్ కట్ చేసి వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ అయితే వైఎస్సార్ కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ABNలో ఇంటర్వ్యూ లైవ్ నడిచింది. అయితే ఈ రెండు ఇంటర్వ్యూల్లో ఎక్కువమంది జనాలు జగన్ ఇంటర్వ్యూ చూసేందుకే ఇష్టపడ్డారు. సీఎం జగన్ ఇంటర్వ్యూకు లక్షల్లో వ్యూస్ వస్తే.. చంద్రబాబు ఇంటర్వ్యూకు వేలల్లో మాత్రమే వ్యూస్ వచ్చాయి. అంటే చంద్రబాబుపై జగన్ పైచేయి సాధించినట్లు అర్థమవుతోంది.
దీంతో బాబు మాటలు గాలిమూటలు అని ప్రజలు ఓ అంచనాకు వచ్చేశారు. గత ముప్పయ్యేళ్లుగా చెప్పినవే చెబుతున్నారని... వాటిల్లో నిబద్ధత లేదని...అందుకే ఆ గాలిమాటలు వినడానికి ప్రజలు ఇష్టపడడం లేదని అంటున్నారు. మరోవైపు ప్రధాని మోడీ రోడ్ షో జరుగుతున్నా.. జగన్ ఇంటర్వ్యూకు లైవ్ స్ట్రీమింగ్‌లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి. ఇదే సీఎం జగన్‌కు ప్రజల్లో ఉన్న క్రేజ్ అని అందరికీ అర్థమైంది. దీంతో సీఎంగా మరోసారి ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని స్పష్టమవుతోందని వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout