CM Jagan:పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు.. చంద్రబాబు, బాలయ్యపైనా సెటైర్లు
- IndiaGlitz, [Thursday,October 12 2023]
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) పెళ్లిళ్లపై సీఎం జగన్(CM Jagan) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు(Chandrababu) దత్తపుత్రుడికి హైదరాబాద్‌లో ఇల్లు ఉన్నా.. అందులో ఇల్లాలు మాత్రం ప్రతి మూడేళ్లకు మారిపోతుంటారంటూ ఘాటు విమర్శలు చేశారు. సామర్లకోట(Samarlakota)లో పేదలకు ఇళ్లను పంపిణీ చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, ఇంకోసా ఇంటర్నేషనల్.. తర్వాత ఎక్కడికి పోతాడో.. ఆడవాళ్లు, పెళ్లిళ్ల వ్యవస్థపై ఆయనకు ఉన్న గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవాలని ప్రజలు ఆలోచించాలని తెలిపారు. నాయకులుగా ఉన్న వ్యక్తులే ఇలా భార్యలను మారిస్తే ఎలా..? వాడుకోవడం వదులకోవడం మాదిరిగానే నియోజకవర్గాలను కూడా మారుస్తారు అంటూ జగన్ ఎద్దేవా చేశారు. తన అభిమానులు, కాపుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు ప్యాకేజీ స్టార్ అప్పుడప్పుడు వస్తుంటారని సెటైర్లు వేశారు.
ఇప్పుడే నెలరోజుల నుంచి చంద్రబాబు రాష్ట్రంలో ఉన్నారు..
అలాగే చంద్రబాబు(Chandrababu) ఎప్పుడైనా వరుసగా నెలరోజుల పాటు మన రాష్ట్రంలో ఉన్నారా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్(Lokesh), బాలకృష్ణ(Balakrishna), దత్తపుత్రుడు ఎవరూ ఏపీలో ఉండరన్నారు. వీళ్లకు ప్రజల మీద ప్రేమ లేదు.. కేవలం అధికారమే కావాలని పేర్కొన్నారు. వీళ్లంతా మనతో చేసేది కేవలం వ్యాపారం మాత్రమేనని వెల్లడించారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా కుట్రలు చేస్తున్నారని.. రాజకీయాలంటే విలువ, విశ్వసనీయత ఉండాలని చెప్పుకొచ్చారు. ఎస్సీలను నా ఎస్సీలని, బీసీ, మైనార్టీలను తమ వారిగా చెప్పుకోరన్నారు. జగన్ పేరు చెబితే స్కీంలు గుర్తుకువస్తాయని.. అదే చంద్రబాబు పేరు చెబితే స్కాంలు గుర్తుకు వస్తాయని తెలిపారు. చంద్రబాబు పాలనలో పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా ఇచ్చిన పాపాన పోలేదని.. ఈ విషయంలో తేడా గమనించాలని కోరారు.
పెద్దాపురం వైసీపీ అభ్యర్థిగా దొరబాబు పేరు ఖరారు..
నాలుగన్నర సంవత్సరాల్లో 99శాతం వాగ్దానాలను నెరవర్చినట్టు ఈ సందర్భంగా జగన్ చెప్పారు. రాష్ట్రంలో 87శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలను ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి సంక్షేమాన్ని తమ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. ఈ సభ ద్వారా పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా దొరబాబు(Dorababu) పేరును జగన్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో దొరబాబును ఆశ్వీరదించి వైసీపీకి మద్దతు ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు.