AP DSC: నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. మెగా డీఎస్సీకి ఆమోదం..
Send us your feedback to audioarticles@vaarta.com
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గత ఐదేళ్లుగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 6,100 పోస్టులను ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. అలాగే అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. త్వరలో ఈ రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం 40 అంశాలతో కూడిన అంశాలపై మంత్రివర్గం సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. వీటిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు.. వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధుల విడుదలకూ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 16 నుంచి వారం రోజుల పాటు చేయూత వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు 18,750 రూపాయల చొప్పుడన ఐదు వేల కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.
ఇక విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒ సెక్రటరీ ఉండాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5వేల కోట్ల రూపాయల మేర నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంధన రంగంలో రూ.22 వేల కోట్లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు.. 3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌కు ఆమోదం లభించింది.
మరిన్ని నిర్ణయాలు ఇవే..
ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1350 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనను మంత్రివర్గం
3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ కు ఆమోదం
న్యాయవాదుల సంక్షేమ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం
ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేచర్ స్టడీస్ అండ్ ట్రైనింగ్ సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
అసైన్డ్ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు అంగీకారం
డిజిటల్ ఇన్ఫ్రా కంపెనీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం
సీఎం కుటుంబ భద్రతకు ఏర్పాటు చేసే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో 25 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అంగీకారం
పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయం
డిస్కంలకు రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి మంత్రివర్గం ఆమోదం
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments