CM Jagan:భార్యలను మారుస్తూ ఉంటారు.. పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ ఘాటు విమర్శలు..
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు జీవిస్తున్నాడని.. దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు అంటూ పవన్ కల్యాణ్ గురించి సీఎం జగన్(CM Jagan) సెటైర్లు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యాదీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, పేద విద్యార్థులకు పెద్ద చదువులు అందేలా అడుగులు వేశామని తెలిపారు. 8.09 లక్షల మంది విద్యార్థులకు రూ.584 కోట్ల ఆర్థిక సాయం అందించామని చెప్పారు. ఇప్పటివరకూ జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా రూ.11,900 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.4,275 కోట్లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండే 'బైజూస్' కంటెంట్ ను పేదలకు సైతం అందేలా మార్పులు తెచ్చినట్లు వివరించారు.
అనంతరం పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దత్తపుత్రుడిని భీమవరం ప్రజలు తిరస్కరించారని.. ఆయన ఇల్లు పక్క రాష్ట్రంలో ఉందని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ కోసం త్యాగాలు చేసే వ్యక్తిని ఎక్కడా చూడలేదని ఇలాంటి వారికి ఓటు వేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు. ప్యాకేజ్ స్టార్, మ్యారేజీ స్టార్ మహిళలను ఆట వస్తువులుగానే చూస్తాడని, నాలుగేళ్లకొకసారి కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తూ ఉంటాడని విమర్శించారు. వివాహ బంధాన్ని గౌరవించడు కానీ చంద్రబాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలి దత్తపుత్రుడు కోరుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. మన వివాహ వ్యవస్థకు గౌరవం ఇవ్వని ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వారికి ఓటు వేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు మంచి చేయలేదని ధ్వజమెత్తారు. కేవలం తన అవినీతి కోసమే అధికారాన్ని వాడి, తన దుష్ట చతుష్టయానికీ, దత్త పుత్రుడికీ బిస్కెట్లు వేసినట్లు వేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. వీళ్లంతా దోచుకోవడం, పంచుకోవడమే చేశారనీ, ఇదంతా ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. అలాగే భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌పై ప్రశంసలు కురిపించారు. సినిమా హీరోను ఓడించిన రియల్ హీరో శీనన్న అంటూ కితాబిచ్చారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని ఆయన అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout