CM Jagan:డిసెంబర్‌లోపు విశాఖ నుంచే పరిపాలన.. సీఎం జగన్ క్లారిటీ..

  • IndiaGlitz, [Monday,October 16 2023]

విశాఖపట్టణం నుంచి పరిపాలనపై సీఎం జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ లోపు తాను వైజాగ్ నుంచే పాలన చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని.. మరో రెండేళ్లలో ఎక్స్‌క్లూజివ్ సివిలియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రానుందన్నారు. రిషికొండలోని ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం.. ఈ మేరకు ప్రసంగించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖ.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల మాదిరిగా ఐటీ హబ్‌గా మరబోతుందని పేర్కొన్నారు.

విశాఖలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి.. మౌలిక వసతులు కల్పిస్తాం..

ఈ కార్యాలయంలో 4,100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా తొలుత వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. త్వరలోనే పరిపాలనా విభాగం అంతా విశాఖకు మారనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్ గా మారిందని ప్రతి ఏడాది విశాఖ నుంచి 15వేల మంది ఇంజనీర్లు తయారువుతున్నారని చెప్పారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయని తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. విశాఖలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికిన నేతలు..

అంతకుముందు తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న సీఎం జగన్‌కు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ,, విశాఖ ఎంపీ సత్యనారాయణ, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు సాదర స్వాగతం పలికారు.

More News

Former Bhadrachalam MLA:తెలంగాణ బీజేపీలో విషాదం.. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు.

Bigg Boss 7 Telugu : మళ్లీ అమ్మాయే.. నయని పావని ఎలిమినేషన్, ఇంటి సభ్యులంతా కంటతడి .. ఎమోషనలైన నాగ్

బిగ్‌బాస్ సీజన్ 7లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగురిని ఇంటిలోకి పంపించిని బిగ్‌బాస్..

YSRCP Social Media: లండన్‌లో ఘనంగా వైసీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం..భారీగా హాజరైన కార్యకర్తలు

రాష్ట్రం సంక్షేమం కోసం సీఎం జగన్ అనుక్షణం ఎంతో కష్టపడుతున్నారని సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి తెలిపారు.

KCR:తెలంగాణ ప్రజలపై కేసీఆర్ వరాలు జల్లు.. రూ.400కే గ్యాస్ సిలిండర్.. పింఛన్ రూ.5వేలకు పెంపు

ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. సబ్బండ వర్గాలే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించారు.

Telangana Congress:తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. పంతం నెగ్గించుకున్న మైనంపల్లి..

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది.