CM Jagan:జిత్తులమారి చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలి.. ప్రజలకు సీఎం జగన్ పిలుపు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఎన్నికలు ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని సీఎం జగన్ తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్వహించిన 'మేమంతా సిద్ధం' సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిత్తులమారి చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు సూచించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
"ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. జగన్‌కు ఓటేస్తే.. ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయి. బాబుకు ఓటేస్తే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయి. చంద్రబాబు అంటే ఎన్నికల ముందు గంగా.. అధికారం దక్కిన తర్వాత చంద్రముఖి. చంద్రబాబుకు ఓటేస్తే పేదవాళ్లు మోసపోతారు. ఇవి పేదల తలరాతను మార్చే ఎన్నికలు. మేం ఎప్పుడూ పేదల పక్షమే. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగన్‌కు ఓటేయాలి. పచ్చమీడియా గాడిదను తీసుకొచ్చి గుర్రం అని ప్రచారం చేస్తాయి’’ అని జగన్ మండిపడ్డారు
చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారా? చంద్రబాబు హయాంలో ఒకరికైనా మంచి జరిగిందా? అదే మీ బిడ్డ అధికారంలోకి రాగానే 2 లక్షల 31 వేలఉద్యోగాలు భర్తీ చేశాడు. జాబు రావాలంటే ఎవరు కావాలి? జాబు రావాలంటే ఫ్యాను రావాలా.. లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా?. పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. గతంలో రైతుకు ఏమీ చేయని చంద్రబాబు.. ఇప్పుడు మేలు చేస్తాడట. చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రొగ్రెస్ రిపోర్ట్. తాము సిద్ధం అంటుంటే వారికి యుద్ధం అని ప్రతిధ్వనిస్తోంది" అని తెలిపారు .
వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. తన హయాంలో రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పగటిపూట 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు.. విడిపించాడా? రైతులకు సున్నా వడ్డీ, ఇన్‌ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టేశాడు.. మనం వచ్చాక రైతన్నకు తోడుగా ఉన్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతున్నకు తోడుగా ఉన్నాం. రైతన్నకు చంద్రబాబు చేసిందేమీ లేదు. వైసీపీ ఎప్పుడూ పేదల పార్టీ అని, ఇప్పుడు జరుగుతున్న సంక్షేమం కొనసాగాలంటే మీ బిడ్డ జగన్‌కు ఓటేసి గెలిపించుకోవాలి" అంటూ ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments