రోజాకు సీఎం జగన్ బంపరాఫర్.. ఉన్నదీ పాయె...!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సీజన్ మొదలుకుని ఫలితాలొచ్చి .. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఎక్కువసార్లు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియలో వినపడిన, కనపడిన పేరు నగరి ఎమ్మెల్యే ‘రోజా’ పేరే. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకుష్ణమ నాయుడు కుటుంబాన్ని రెండు సార్లు ఘోరంగా ఓడించిన ఘనత రోజాదే అని చెప్పుకోవాలి. అలా రాజకీయాల్లో రాణిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రోజా ఆంధ్రాలోనే ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచారు. దీంతో వైఎస్ జగన్ కేబినెట్‌లో కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని.. అది కూడా సినిమాటోగ్రఫీ లేదా హోం శాఖ దక్కుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
సామాజికవర్గం పరంగా!
సామాజిక వర్గం పరంగా చాలా వరకు రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కనబెట్టిన వైఎస్ జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులు, క్షత్రియ వర్గాలకు న్యాయం చేశారు. అంతేకాదు ఒకప్పుడు రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున మంత్రులను తీసుకునే కేబినెట్‌లోని జగన్ మాత్రం అతి తక్కువ మందిని మాత్రమే తీసుకున్నారు. పైగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కేవలం నలుగుర్ని మాత్రమే తీసుకున్నారు. అందులో రోజా కూడా రెడ్డి సామాజిక వర్గం కావడంతో ఆమెకు దారులన్నీ మూసుకుపోయాయి. పైగా రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలా మంది ఒకట్రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్‌లు, డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేలు ఉండటం సీనియార్టిని బట్టి కూడా రోజాను పక్కనపెట్టడం జరిగింది.
ఆఖరి నిమిషం వరకూ..!
జూన్-07న వైసీపీఎల్పీ సమావేశం జరిగిన అనంతరం ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయా..? అని అటు నేతల్లో.. ఇటు అభిమానుల్లో సర్వత్రా టెన్షన్ మొదలైంది. అయితే శుక్రవారం సాయంత్రం వైసీపీ కీలకనేత విజయసాయిరెడ్డి ఫోన్ కాల్స్‌తో క్లారిటీ రాగా.. మంత్రి పదవులు ఆశించిన కొందరు భంగపడ్డారు. అయితే వీరిలో ముఖ్యంగా రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. వీరిద్దరిదీ ఒకే సామాజిక వర్గం.. పైగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కావడంతో ఇద్దరికీ దారులు మూసుకుపోయాయి. అయినప్పటికీ శుక్రవారం సాయంత్రం వరకూ ఎక్కడో చిన్న ఆశ.. కచ్చితంగా మనకు ఫోన్ రాకపోతుందా అని వేయి కళ్లతో ఎదురుచూపు.. అయితే అర్ధరాత్రి అయినా ఫోన్ కాల్ రావడంతో కొందరు విజయవాడ నుంచి వెనుదిరిగారు. అయితే ఆఖరి నిమిషం వరకు రోజా విషయంలో సస్పెన్షన్.. సస్పెన్షన్.. ఇక ఇంటికి వెళ్దాం అనుకున్న సమయంలో రోజా, ఆర్కే ఇద్దరూ ప్రమాణం రోజు అందుబాటులో ఉండాలని అధిష్టానం నుంచి సందేశం.. దీంతో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే శనివారంతో రోజాకు మంత్రి పదవి ఇవ్వట్లేదని.. కచ్చితంగా ఆమెకు న్యాయం చేస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని సమాచారం.
జగన్ ఆఫర్‌ను కాదన్న రోజా..!
వాస్తవానికి రోజాకు బంపరాఫర్ ఇచ్చారట. అసెంబ్లీ స్పీకర్‌గా మొదట రోజాను వైఎస్ జగన్ ఫిక్స్ చేశారట. అయితే రోజా మాత్రం తనకు మంత్రి పదవి ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో రోజాను డిప్యూటీ స్పీకర్‌గా అయినా నియమించాలని వైసీపీ పెద్దలు నిర్ణయించారట. అయితే డిప్యూటీ స్పీకర్‌గా కూడా కాదన్న రోజా.. మంత్రి పదవి ఇచ్చితీరాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారట. దీంతో.. సెకండ్ టెర్మ్‌లో కచ్చితంగా న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారట.
రెండో దఫా పక్కానా..!
మొదటి విడతలో మంత్రి పదవి దక్కించుకోలేకపోయిన రోజా.. రెండో దఫా మాత్రం పక్కాగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే రోజా రెండున్నరేళ్లు వేచి చూడాల్సిందేనన్న మాట. రోజాతో పాటు ఆళ్ల కూడా రెండేళ్లు వేచి చూడాల్సిందేనన్న మాట. అంతేకాదు.. ప్రస్తుతం మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న వారిలో చాలామంది రెండున్నరేళ్లలో రిటైర్ అవుతారని.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఊరుకునే ప్రసక్తే లేదని జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే.
సో.. ఈ లెక్కన చూస్తే రోజాకు మంత్రి పదవి మాత్రం పక్కా.. కాకపోతే మరో రెండున్నరేళ్లు వేచి చూడాల్సిందే మరి. రెండేళ్ల తర్వాత అయినా రోజాకు మంత్రి పదవి దక్కుతుందో అప్పుడు కూడా జగన్ మొండిచేయి చూపుతారో తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments