హైకోర్టుని ఆశ్రయించిన సీఎం జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. గతంలో సీబీఐ, ఈడీ శాఖలు జగన్పై అక్రమాస్తుల కేసులు వేశాయి. వీటికి సంబంధించి గతంలో ఆయన అరెస్ట్ కూడా అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి సీబీఐ కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. ముఖ్యమంత్రి కాక మునుపు కోర్టుకు హాజరవుతూ వచ్చిన వై.ఎస్.జగన్..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యక్తిగతంగా హాజరు కావాలంటే ఇబ్బంది అవుతుందని, తను కోర్టుల్లో కాలయాపన చేస్తే రాష్ట్ర పరిపాలన, విధులకు అడ్డంకిగా మారుతుందని ఆయన సీబీఐ కోర్టును కోరారు. అయితే సదరు సీబీఐ కోర్టు జగన్ విన్నపాన్ని తోసిపుచ్చింది.
ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయన కారణాన్ని చూపిస్తూ తన వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వకపోవడం సరికాదని జగన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. జగన్ పిటిషన్పై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. జనవరి 31న జగన్ వ్యక్తిగతం కోర్టుకు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఇటీవల జగన్ను ఆదేశించింది. ప్రతివారం ఏదో కారణాన్ని చూపుతున్నారని, ఈ నెల 31న కోర్టుకు హాజరు కాకుంటే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని సీబీఐ కోర్టు పేర్కొంది. అక్రమాస్తులు, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దాఖలు చేసిన కేసుల్లో జగన్ నిందుతుడుగా ఉన్న జగన్ కోర్టుకు తప్పకుండా హాజరు కావాల్సిందేనని కోర్టు ఇటీవల తెలియజేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments