హైదరాబాద్‌లో అర్ధరాత్రి నడిరోడ్డుపై క్లబ్ డ్యాన్సర్ బట్టలు విప్పి...!!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అరాచకాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో షీటీమ్స్ అంటూ పోలీసులు కొత్త ప్రయోగాలు చేసినప్పటికీ ఆడపిల్లలపై దాడులు మాత్రం ఆగట్లేదు. తాజాగా హైదరాబాద్ బేగంపేటలోని లెస్బెన్ పబ్‌లో అర్ధరాత్రి నడిరోడ్డుపై ఓ డ్యాన్సర్‌పై దాడి జరిగింది. నడిరోడ్డుపై తనను వివస్త్రన చేసి, దాడికిపాల్పడ్డారని క్లబ్ డ్యాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసి కన్నీరుమున్నీరైంది.
అండగా నిలవాల్సిన నిర్వాహకులు..!
వివరాల్లోకెళితే.. సినిమాల్లో చాన్స్‌ల కోసం నగరానికి వచ్చిన ఓ యువతి ఆర్థిక సమస్యల కారణంగా క్లబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే అదే పబ్‌లో తనతో కొందరు కస్టమర్లు తాగి అసభ్యంగా ప్రవర్తించేవారని.. మరికొందరైతే కోరిక తీర్చాలంటూ వేధించారని పోలీసు ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అంతేకాదు.. కస్టమర్లు ఇలా చేస్తుంటే తమ ఉద్యోగికి అండగా నిలవాల్సిన క్లబ్ నిర్వాహకులు కనీసం పట్టించుకోకపోగా తనపై ఒత్తిడి చేశారని వాపోయింది. 'ఇటువంటి అసాంఘీక కార్యక్రమాలకు అంగీకరించలేదు. దీంతో వారంతా నాపై కక్ష్య కట్టారు. తరచూ ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడేవారు. పబ్‌లో బ్లేడ్‌లతో ఒళ్లంతా గాయాలు చేసే వారు.
అర్ధరాత్రి నడిరోడ్డుపై..!
శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికెళ్తుండగా బేగంపేటలో నడిరోడ్డుపై నలుగురు అమ్మాయిలు, మరోవ్యక్తితో కలిసి తనపై దాడి చేశారని ఆమె చెబుతోంది. తన ఒంటిపై బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించారని కంటతడిపెట్టింది. అంతేకాదు.. ఇలా చేసినట్లు ఎవరికైనా చెబితే బాగోదని బెదిరించి.. ప్రముఖ రాజకీయ నాయకులు తెలుసంటూ బెదిరించినట్లు డ్యాన్సర్ చెబుతోంది. అయితే సయ్యద్ అనే వ్యక్తి వీళ్లందరికి బాస్ అని ఆమె పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బాధితులు ఇంకెందరో..!
అయితే తనలాగా క్లబ్‌లో ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారని.. తనతో పాటు వారికి కూడా న్యాయం చేయాలని డ్యాన్సర్ పోలీసులను వేడుకుంది. అయితే త్వరలోనే నిందితులను పట్టుకుని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారని డ్యాన్సర్ మీడియాకు వెల్లడించింది.
కాగా.. హైదరాబాద్‌లో పబ్ కల్చర్ రోజురోజుకు ఎక్కువవుతోంది. పోలీసులు అప్పుడప్పుడు క్లబ్‌లపై దాడులు చేసినప్పటికి మమా అనిపించేసి మిన్నకుండిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే నిర్వాహకులు, నిందితులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు పోలీసులు న్యాయం చేయాల్సి ఉంది. అయితే ఇలా ఎక్కువగా రాజకీయ, ప్రముఖులకు చెందిన వారి పిల్లలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. ఈ వ్యవహారంలో పోలీసులు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments