'క్లైమాక్స్' కి U/A సర్టిఫికెట్, మార్చి 5న రిలీజ్!!
Send us your feedback to audioarticles@vaarta.com
కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా విభిన్న కథతో విచిత్ర పాత్రలు, కథనాలతో భవాని శంకర్. కె. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "క్లైమాక్స్". సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ తో మార్చి 5న విడుదల కానుంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ కి అద్భుతమైన స్పందన రావడమే కాక అందులో మోడీ డౌన్ డౌన్ అనే నినాదాలపై వివాదం కాగా తాజాగా వచ్చిన సెన్సార్ సెర్టిఫికెట్ వాటన్నిటికి సమాధానం చెబుతుంది అంటున్నారు చిత్ర యూనిట్. రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఈ చిత్రంలో కరుణాకర్ రెడ్డి , రాజేశ్వర్ రెడ్డి లు నిర్మించిన ఈ చిత్రంలో సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర మాస్టర్, రమేష్ లు నటించారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ " ట్రైలర్ లోని విభిన్న కథనాలు ఇప్పటికే చిత్రం పై అంచనాలని అమాంతం పెంచేసాయి. మార్చి 5న థియేటర్లలో విడుదలయ్యే మా క్లైమాక్స్ చిత్రం క్లైమాక్స్ ఎపిసోడ్ కచ్చితంగా అందర్నీ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తుందని మాకు నమ్మకముంది" అన్నారు.
చిత్ర దర్శకుడు భవాని శంకర్ మాట్లాడుతూ " నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారితో ఇంతవరకు ఎవ్వరు తీయని కొత్త కథతో, ఎప్పుడు చూడని కథనాలతో, రాజేంద్రప్రసాద్ ఇటువంటి అద్భుతమైన పాత్రలు చేస్తాడా అనే విధంగా విచిత్ర కాన్సెప్ట్ తో "క్లైమాక్స్" సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. క్లైమాక్స్, మర్డర్ మిస్టరీతో పాటు ట్విస్ట్స్ మరియు బ్యాక్ డ్రాప్ కామెడీ, ఇంతవరకు మీరు ఎప్పుడు చూడని కథనాలు ఉంటాయి. మునుపెన్నడూ చూడని థ్రిల్లింగ్ క్లైమాక్స్ ని చూపించడానికి మా క్లైమాక్స్ తో మీ ముందుకు వచేస్తున్నాం మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com