పులికి క్లీన్ యు
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా పులి. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దేవిశ్రీ అందించిన సంగీతం ఈ నెల 19న విడుదల కానుంది. అక్టోబర్ 1న విడుదల కానున్న ఈ సినిమాకు సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ ను ఇచ్చింది. ఈ సినిమాలో శ్రీదేవి రాణిగా కనిపిస్తారు. సుదీప్, శ్రుతి, హన్సిక ఇతర కీలక పాత్రధారులు. సోషియో ఫాంటసీ అడ్వంచరస్ సినిమా ఇది. చింబుదేవన్ దర్శకత్వం చేసిన తీరు అందరికీ వినోదాన్ని పంచేలా ఉంటుందని ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న శోభారాణి చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments