'పిట్టగోడ' చిత్రానికి క్లీన్ 'యు' డిసెంబర్ 24 విడుదల

  • IndiaGlitz, [Tuesday,December 20 2016]

విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, సన్‌షైన్‌ సినిమాస్‌ పతాకాలపై అనుదీప్‌ కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి. నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'పిట్టగోడ'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. మంచి కథ, కథనాలతో క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో మంచి ఫీల్‌ వుందని, మ్యూజికల్‌గా కూడా చాలా బాగుందని సెన్సార్‌ సభ్యుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 24న విడుదల చేస్తున్నారు.
విశ్వదేవ్‌ రాచకొండ హీరోగా, పునర్నవి భూపాలం హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఉయ్యాలా జంపాలా రాజు, జబర్దస్త్‌ రాజు, శివ ఆర్‌.ఎస్‌., శ్రీకాంత్‌ ఆర్‌.ఎన్‌. ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: 'ప్రాణం' కమలాకర్‌, నిర్మాతలు: దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి., దర్శకత్వం: అనుదీప్‌ కె.వి.

More News

మెగా హీరోతో మెహరీన్

మెగాబ్రదర్ తనయుడు వరుణ్ తేజ్, హీరోగా విలక్షణమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ముకుంద, కంచె, లోఫర్ వంటి డిఫరెంట్ మూవీస్తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

సందీప్ కిషన్ ను భయపెట్టిన పార్శిల్..!

యువ కథానాయకుడు సందీప్ కిషన్ కు ఓ పార్శిల్ వచ్చింది.

బి, సి సెంటర్స్ లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది - నిర్మాత కె.కె.రాధామోహన్

పృథ్వీ, నవీన్చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'.

విడుదలకు ముస్తాబవుతున్న నయనతార... 'డోర'

వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్

విశాల్ తో కలిసి నటించిన 'ఒక్కడొచ్చాడు' నా బర్త్ డే గిఫ్ట్ గా భావిస్తున్నాను - తమన్నా

మాస్ హీరో విశాల్ హీరోగా ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఒక్కడొచ్చాడు'.