ఫేర్‌వెల్ చేసుకుంటామని , వార్డెన్ ఇంటికెళ్లగానే... హాస్టల్‌లో పదో తరగతి విద్యార్ధుల సిట్టింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
సార్.. పరీక్షలు దగ్గర పడ్డాయి కదా.. ఫేర్ వెల్ పార్టీ చేసుకుంటాం సార్ అని పదోతరగతి విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌ని కోరారు. పిల్లల కోరికను పెద్ద మనసుతో అర్ధం చేసుకున్న ఆయన.. చికెన్ కర్రీ చేయించి మరీ.. వాళ్లని సంతోష పెట్టారు. అయితే ఆ ఫేర్ వెల్ పార్టీలో.. మద్యం తగ్గిందని భావించిన విద్యార్ధులు.. బీర్ బాటిళ్లను తెప్పించి ఫుల్లుగా తాగేశారు. వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని బీసీ బాలుర హాస్టల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హాస్టల్లోని పదో తరగతి విద్యార్థులు, కింది తరగతి విద్యార్థులు కలిసి ఏప్రిల్ 17న రాత్రి వీడ్కోలు పార్టీ చేసుకుంటామని హాస్టల్ వార్డెన్ను పర్మిషన్ కోరారు. ఆయన వారి కోరికను మన్నించారు. అంతేకాకుండా హాస్టల్‌లోని వంటమనిషి చేత చికెన్ వండించారు. విద్యార్థులందరూ.. భోజనం చేసిన తర్వాత వార్డెన్ ఇంటికి వెళ్లిపోయారు. అయితే ముక్క వుంది.. చుక్క లేకపోతే ఎలా అనుకున్నారో ఏమో కానీ వార్డెన్ అటు వెళ్లగానే మందు పార్టీకి స్కెచ్ వేశారు పిల్లలు.
మిత్రులతో హాస్టల్ వెనుక నుంచి బీర్ బాటిల్స్ తెప్పించుకున్నారు. ఆ తర్వాత అందరూ సిట్టింగ్ వేసి చికెన్తో పాటు మద్యం సేవించి ఎంజాయ్ చేశారు. అక్కడితో ఆగకుండా మందు తాగుతున్నప్పుడు ఫొటోలు తీసుకున్నారు. వీటిని సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. దీంతో విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. అంతే హాస్టల్లోని విద్యార్థులను వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఈ వ్యవహారంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments