బాలయ్య సినిమాకు పోటీగా..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణకు కలిసొచ్చిన దర్శకులలో బోయపాటి శ్రీనుకి ప్రత్యేక స్థానముంది. బాలయ్యకు వరుస పరాజయాలు ఉన్న సమయంలో.. సింహా, లెజెండ్ వంటి సినిమాలను అందించి.. ఆయనకే కాదు ఆయన అభిమానులకు ఫేవరేట్ డైరెక్టర్ అయ్యారు బోయపాటి . అలాంటి బోయపాటి.. బాలకృష్ణతో బరిలో దిగనున్నారా? అవుననే వినిపిస్తోంది టాలీవుడ్లో.
కాస్త వివరాల్లోకి వెళితే.. వి.వి.వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. సరిగ్గా అదే సమయంలో బోయపాటి శ్రీను తదుపరి చిత్రం కూడా విడుదల కానుండడం గమనార్హం.
రంగస్థలంతో ఇటీవలే ఓ ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్.. ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేయనుందని సమాచారం. మరి.. బాలయ్యతో పోటీపడుతున్న వైనం బోయపాటికి ఎలాంటి ఫలితమిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com