శంకర్‌కి షాకిచ్చిన రాజమౌళి..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే అని అందరూ అనుకునేవారు.. కానీ దక్షిణాదికి చెందిన కోలీవుడ్ డైరెక్టర్ తమిళ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటారు. ఆయన రూపొందించిన జెంటిల్‌మేన్, ఒక్కడున్నాడు, ఇండియన్, జీన్స్, రోబో తదితర చిత్రాలు కంటెంట్ పరంగానే కాదు.. మేకింగ్ వేల్యూస్ పరంగానూ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయంటూ ప్రశంసలు అందుకున్నాయి. కానీ ఇప్పుడు శంకర్‌ను మించేలా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమానే కాదు...తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటాడు రాజమౌళి. దీంతో దక్షిణాది శంకర్ గొప్పవాడా? రాజమౌళి గొప్పోడా? అనే వాదన కూడా బయలు దేరింది. చివరకు రాజమౌళి ఇప్పుడు టాప్‌లో నిలిచి ఉన్నాడు.
ఇప్పుడు శంకర్, రాజమౌళి మధ్య సినిమాల పరంగా భారీ పోటీనే నెలకొంది. శంకర్‌ను మించి పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన రాజమౌళి `ఆర్ఆర్ఆర్` సినిమాను తెరకెక్కిస్తోన్నసంగతి తెలిసిందే. మరోవైపు రోబో తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని శంకర్, మళ్లీ తన హవాను చాటాలని `ఇండియన్ 2` సినిమాను కమల్‌హాసన్‌తో తెరకెక్కిస్తున్నాడు. నిజానికి `ఇండియన్ 2` ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదలవుతుందని అనుకున్నారు. అయితే సినిమా కొన్ని కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే షూటింగ్ పూర్తయ్యేలా ఉంది. దీంతో ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని శంకర్ భావించాడు.
అయితే శంకర్ ఆలోచనలకు రాజమౌళి బ్రేకులేశాడు. ఎందుకంటే ఆయన కంటే ముందుగానే రాజమౌళి తన `ఆర్ఆర్ఆర్` సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల చేయబోతున్నామని అధికారికంగా ప్రకటించేశాడు. దీంతో ఇప్పుడు శంకర్‌కు పెద్ద సమస్యే వచ్చి పడింది. రాజమౌళి సినిమాతో తన సినిమాను విడుదల చేయలేడు. అక్కడే మార్కెట్ సమస్య వచ్చిపడింది. దీంతో శంకర్ `ఇండియన్ 2`ను వెనక్కి తీసుకెళ్లక తప్పేలా లేదు. అనుకోని షాక్‌తో శంకర్ సతమతమవుతున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com