Vishnu VS Manoj:బంధువును కొట్టిన మంచు విష్ణు.. ‘ఇళ్లలోకి చొరబడి కొడుతూ వుంటాడు’ అంటూ వీడియో పెట్టిన మనోజ్
Send us your feedback to audioarticles@vaarta.com
కుటుంబం అన్నాకా.. భార్యాభర్తలు, అన్నదమ్ములు, తోడికోడళ్లు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు సహజం. సామాన్యుల నుంచి ప్రముఖల దాకా ఇది కామన్. అయితే సామాన్యులు రోడ్డెక్కి కొట్టుకుంటే.. ప్రముఖుల అంతర్గత విషయాలు బయటకు రావు. కాగా.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో ఒకటైన మంచువారి ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కాయి. మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లకు మధ్య గత కొన్నిరోజులుగా విభేదాలు నడుస్తున్నట్లుగా ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల మనోజ్-మౌనిక పెళ్లికి మోహన్ బాబు చివరిలో రావడం, మంచు విష్ణు ఏదో గెస్ట్‌లాగా వచ్చి వెళ్లిపోవడంతో కుటుంబంలో ఏదో జరుగుతుందన్న అనుమానం అందరికీ కలిగింది. తాజాగా మంచు మనోజ్ బంధువులపై స్వయంగా విష్ణు దాడికి దిగడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఇలా ఇళ్లలోకి చొరబడి తన వాళ్లను, బంధువులను ఇలా కొడుతూ వుంటాడని.. ఇది సిచ్యుయేషన్’’ అంటూ మనోజ్ రాశారు.
సారథి అనే వ్యక్తిపై దాడికి దిగిన విష్ణు :
గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. మోహన్ బాబుకు బంధువైన సారథి అనే వ్యక్తిపై విష్ణు దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో మనోజ్ అక్కడే వుండటంతో ఈ తతంగాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టినట్లుగా సమాచారం. మరోవైపు అన్నాదమ్ముల మధ్య గొడవ నేపథ్యంలో మోహన్ బాబు స్పందించారు. సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కారంటూ కొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి సూచన మేరకు మనోజ్ సదరు వీడియోను ఎఫ్బీ నుంచి డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు సహజమేనని.. ఇద్దరి మధ్యా సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నానని మోహన్ బాబు ఓ ఛానెల్‌తో అన్నట్లుగా తెలుస్తోంది.
ఘనంగా మంచు మనోజ్- మౌనిక వివాహం:
ఇదిలావుండగా.. ఈ నెల 3న మంచు మనోజ్- మౌనిక వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. మంచు లక్ష్మీ ఇంట్లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భార్యను ముద్దాడుతూ మనోజ్ షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. కొత్త జంట చూడముచ్చటగా వుంది. గోల్డ్ కలర్ పట్టు కుర్తా, దోతిలో మంచు మనోజ్.. ఆకుపచ్చ, పింక్ కలర్ పట్టుచీరలో మౌనిక ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతం మనోజ్-మౌనికా రెడ్డిల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రణతితో విడాకుల తర్వాత ఒంటరిగానే మనోజ్:
కాగా.. మంచు మనోజ్ తొలుత ప్రణతి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2019లో విడాకులు తీసుకుంది. ఆనాటి నుంచి మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నోసార్లు మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ అవన్నీ గాలి వార్తలేనని తేలిపోయింది. కానీ ఇప్పుడు తాజా ఘటన వెనక కథేంటో అర్ధం కావడం లేదు. ఇక భూమా మౌనికా రెడ్డి విషయానికి వస్తే, ఇమెకు కూడా ఆల్రెడి పెళ్లయ్యింది. బెంగళూరుకు చెందిన గణేష్ రెడ్డితో మొదటి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఐదేళ్ల బాబు కూడా వున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ దంపతులు రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. గణేష్ నుంచి వీడిపోయాక.. మౌనికా రెడ్డి హైదరాబాద్‌లోనే వుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com