స్వాతి రెడ్డి ఫోటో వైరల్.. ఫేక్ ప్రచారం, అసలు క్లారిటీ ఇదిగో!
Send us your feedback to audioarticles@vaarta.com
దేశం గర్వించదగ్గ చిత్రకారుడు రాజా రవివర్మ. మగువల అందాన్ని పొగడాలంటే ఆయన పెయింటింగ్స్ తో పోల్చాల్సిందే. అంతగా రాజా రవివర్మ ఆర్ట్ వర్క్ అందరిని మంత్ర ముగ్దుల్ని చేసింది. రాజా రవివర్మ గీసిన పెయింటింగ్ అంటూ ఓ అందమైన యువతి ఫోటోని ఓ నెటిజన్ వైరల్ చేశాడు.
వివరాల్లోకి వెళితే.. ఓ నెటిజన్ రాజా రవివర్మ పెయింటింగ్ అంటూ అందమైన ఫోటోని.. అలాగే మోనాలిసా పెయింటింగ్ ని జతచేస్తూ కామెంట్ పెట్టాడు. 'ఇందులో మొదటిది రాజా రవి వర్మ గీసిన పెయింటింగ్.. మీరు ఇంతవరకు చూడనిది. మరొకటి మోనాలిసా పెయింటింగ్.. కొన్ని వందలసార్లు మీరు చూసి ఉంటారు. కేవలం మార్కెటింగ్ ప్రాపగాండా ద్వారానే దీనిని మనపైకి రుద్దుతున్నారు' అని ఆ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
రాజా రవివర్మ పెయింటింగ్స్ సరైన విధంగా ప్రచారం దొరకడం లేదు అనేది అతడి ఆవేదన. అయితే అతడి పోస్ట్ లో పొరపాటు దొర్లింది. రాజా రవివర్మ పెయింటింగ్ అంటూ అతడు పోస్ట్ చేసిన పిక్ హీరోయిన్ కలర్స్ స్వాతిది. కలర్స్ స్వాతి ఫోటోని అతడు రవి వర్మ పెయింటింగ్ అని పోస్ట్ పెట్టాడు. దీనితో అది కాస్త ఫేక్ గా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రాజా రవి వర్మ పెయింటింగ్స్ స్టైల్ లో మన హీరోయిన్లు రీక్రియేట్ ఫోటోషూట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కలర్స్ స్వాతి కూడా 2019లో రవి వర్మ పెయింటింగ్ ని రీక్రియేట్ చేస్తూ ఇలా ఫోటో షూట్ కు ఫోజు ఇచ్చింది. దానిని కాస్త సదరు నెటిజన్ మనం ఎప్పుడూ చూడని రవివర్మ పెయింటింగ్ అని తప్పుగా భావించాడు. ఫలితంగా ఫేక్ ప్రచారం వైరల్ అయింది. హీరోయిన్ సమంత, ఖుష్బూ, శృతి హాసన్ లాంటి సెలెబ్రిటీలు అంతా రవి వర్మ పెయింటింగ్స్ ని రీక్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com