రవితేజ, త్రినాధరావు మూవీ ఆగిపోలేదు.. ఇదిగో క్లారిటీ!
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజ రవితేజ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ లవర్స్ ని ఉరూతలూగించే టాలీవుడ్ హీరోలలో రవితేజ ఒకరు. రవితేజ కామెడీ టైమింగ్, ఎనెర్జిటిక్ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకు క్రాక్ రూపంలో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. ఈ చిత్రంతో రవితేజ బాక్సాఫీస్ వద్ద తిరిగి పుంజుకున్నాడు.
ఇదీ చదవండి: 'లాల్ సలామ్' ట్రైలర్: మా ఫ్రెండ్ ల్యాండ్ మైన్ తొక్కాడు.. ఏం చేయాలి..
ఇక రవితేజ తదుపరి చిత్రాలపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. సినిమా చూపిస్తమావ, నేను లోకల్, హాలోగురుప్రేమకోసమే చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు త్రినాధరావు నక్కిన. వీరిద్దరి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కాల్సి ఉంది. అయితే ఈ చిత్రం నుంచి రవితేజ తప్పుకున్నట్లు ఇటీవల పెద్దఎత్తున పుకార్లు వినిపించాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమంతో ప్రారంభం అయింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ప్రారంభించలేదు అంతే. లాక్ డౌన్ ఎత్తివేయగానే షూటింగ్ ప్రారంభిస్తారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
శరత్ మండవ దర్శత్వంలో కూడా రవితేజ నటించనున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా లాక్ డౌన్ తర్వాత ప్రారంభిస్తారు. అయితే ముందుగా త్రినాధరావు దర్శకత్వంలో చిత్రం షూటింగ్ కి వెళుతుందా లేక శరత్ మండవ చిత్రమా అనేది అప్పటి ప్రయారిటిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. మొత్తానికి ఖిలాడీ తర్వాత రవితేజ నటించబోయే రెండు చిత్రాలు ఇవే.
రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. వరుస క్రేజీ చిత్రాలతో రవితేజ అభిమానులకు మాస్ జాతర అందించబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com