రానా, మిహీక పెళ్లి తేదీ మార్పుపై క్లారిటీ

  • IndiaGlitz, [Wednesday,June 10 2020]

సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌గ్గుబాటి వారికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. వీరి మూడోత‌రంగా సినీ రంగంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు రానా ద‌గ్గుబాటి. ఈ పాన్ ఇండియా న‌టుడు, మిహీకా బ‌జాజ్‌ను పెళ్లి చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రానా ద‌గ్గుబాటి, మిహీకా బ‌జాజ్‌కు రోకా కూడా జ‌రిగింది. రానా, మిహీకల మ్యారేజ్‌ ఆగ‌స్ట్ 8న హైద‌రాబాద్‌లో జ‌రుగుతుందని సురేష్ బాబు ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. రానా ప్రేమ గురించిన విష‌యాన్ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన‌ప్పుడు రానా తండ్రి, ప్ర‌ముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు రానా పెళ్లి ఈ ఏడాది చివ‌ర‌లో ఉంటుంద‌ని చెప్పారు. ఆ ప్ర‌కారం డిసెంబ‌ర్‌లో రానా, మిహీక పెళ్లి జ‌ర‌గ‌నుందని అంద‌రూ అనుకున్నారు.అయితే ఆగ‌స్ట్ 8నే వీరికి పెళ్లి చేయాల‌ని ఇరు కుటుంబాల పెద్ద‌లు అనుకున్నారు.

అయితే సోష‌ల్ మీడియాలో రీసెంట్‌గా క‌రోనా ఎఫెక్ట్‌, షూటింగ్స్ ప్రారంభం కావ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో వీరి పెళ్లి వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఈ వార్త‌ల‌పై ఇరు కుంటుంబాల పెద్ద‌లు స్పందించారు. రానా, మిహీక పెళ్లి వాయిదా ప‌డ‌న‌నుందంటూ వస్తున్న వార్త‌ల్లో నిజం లేదంటూ ఆగ‌స్ట్ 8నే వీరి పెళ్లి జ‌ర‌గ‌నుందంటూ తెలియ‌జేశారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే రానా హీరోగా న‌టించిన అర‌ణ్య విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. మ‌రో ప‌క్క సాయిప‌ల్ల‌వితో క‌లిసి విరాట‌ప‌ర్వం చిత్రంలో రానా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

More News

స్పీడు పెంచుతున్న వ‌ర్మ‌

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు వ‌ర్మ ఏదైనా డిఫ‌రెంట్‌గానే ఆలోచిస్తాడు. అంద‌రూ క‌రోనా ఎఫెక్ట్‌తో షూటింగ్స్ మానేసి ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.,

మ‌హేశ్‌ని ఢీ కొట్ట‌బోతున్న క‌న్న‌డ స్టార్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమాగా `స‌ర్కారు వారి పాట` అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న

ఖుష్బూకి షాక్‌.. ఆడియో టేప్ లీక్‌

సీనియ‌ర్ న‌టి, నిర్మాత‌, కాంగ్రెస్ నేత ఖుష్బూ సుంద‌ర్‌కి ఈరోజు పెద్ద షాక్ త‌గిలింది. ఆమె జ‌ర్న‌లిస్టుల గురించి మాట్లాడిన ఆడియో టేప్ ఒక‌టి లీక్ కావ‌డ‌మే

చిరుపై బీజేపీ మహిళా నేత తీవ్ర విమర్శలు!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోలు, ప్రముఖ దర్శకులు, నిర్మాతలు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విషయం విదితమే.

ఏపీలో ఇకపై ఎస్సెమ్మెస్‌ల ద్వారా కరోనా ఫలితం..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు.