ఈ మూడ్రోజుల్లో 3 రాజధానులపై తేలిపోనుంది!
Send us your feedback to audioarticles@vaarta.com
నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపు వ్యవహారంపై గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ర్యాలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. మూడు రాజధానులపై సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నామ మాత్రానికే ప్రకటన చేశారే తప్ప ఇంతవరకూ క్లారిటీగా స్పందించలేదు. దీంతో రాజధాని రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఇప్పటికే మూడు రాజధానుల వ్యవహారంపై రెండు కమిటీలు నివేదికలను సీఎంకు అందజేయగా హై పవర్ కమిటీ పర్యవేక్షిస్తోంది. ఇదిలా ఉంటే పండుగ తర్వాత మూడు రాజధానులపై తేలిపోనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ మూడు బిల్లులపై..!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈనెల మూడురోజుల పాటు సమావేశం జరగనుంది. జనవరి 20, 21, 22 తేదీల్లో శాసన సభ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ విషయమై అసెంబ్లీ కార్యదర్శికి శాసన సభ వ్యవహారాల మంత్రి సమాచారం పంపారు. ఈ సమావేశాల్లో భాగంగా మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్ట సవరణతో పాటు మరో మూడు బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుల్లో ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ వర్గీకరణ బిల్లు, మూడు రాజధానులపై ఈ సమావేశాల్లో నిశితంగా చర్చించనున్నారు.
ఈ మూడ్రోజుల్లోనే..!
ఈనెల 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా జరగనుందని ఇప్పటికే మంత్రులు స్పష్టం చేశారు. 20న ఉదయం 9:30గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో రాజధానిపై హై పవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలపనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ..హై పవర్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. మొత్తానికి చూస్తే ఈ మూడ్రోజుల్లో మూడు రాజధానులు ఉంటాయా..? లేదా..? అనేది తేలిపోనుంది. అయితే ఈ మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా..? అస్సలు వెనక్కి తగ్గేది లేదని ముందుకెళ్తుందా..? అనేది తెలియనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout