హైదరాబాద్‌లో ఇకపై 24 గంటలూ సిటీ బస్సులు.. ఏయే రూట్లలో అంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాదీలకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై నగరంలో 24 గంటలూ సిటీ బస్సులు నడుస్తాయని వెల్లడించింది. ప్రయాణికుల డిమాండ్ , రద్దీగా ఉన్న మార్గాల్లో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ పేర్కొంది. ఇప్పటికే పలు మార్గాల్లో నైట్ బస్సులు ప్రయోగాత్మకంగా నడుపుతుండగా... ప్రయాణికుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో 24 గంటల పాటు బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు.
ఈ విధానం వల్ల.. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు అర్థరాత్రి వేళల్లో చేరుకునే ప్రయాణికులకు ఊరట కలగనుంది. అర్ధరాత్రి పూట దూర ప్రాంతాలకు చేరుకొనే ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లేందుకు భారీగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు ఈ సమయాల్లో మహిళలపై అత్యాచారాలు, దోపిడీలు కూడా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 24 గంటల పాటు సిటీ బస్సులు నడవడం వల్ల నేరాల రేటు తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ నైట్ బస్సుల్లో అన్ని రకాల పాస్‌లను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అలాగే 24 గంటల పాటు చెల్లుబాటయ్యే ట్రావెల్ యాజ్ యు లైక్ (టీఏవైఎల్) టిక్కెట్లని అనుమతిస్తారు. ఈ నైట్ బస్సులు డిపోలకు చేరుకొనే సమయానికి రెగ్యులర్ బస్సులు తిరిగి రోడ్డెక్కుతాయి. దీంతో 24 నాలుగు గంటల పాటు ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
నైట్ బస్సులు నడిచేది ఈ రూట్లలోనే:
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పటాన్చెరు వరకు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జాము వరకు 2 బస్సులు నడపనున్నారు.
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఆఫ్జల్‌గంజ్, మెహదీపట్నం, బోరబండ వరకు. ఈ మార్గాల్లో ప్రతి అరగంట నుంచి 45 నిమిషాలకు ఒక బస్సు సర్వీసు.
సికింద్రాబాద్ చిలకలగూడ క్రాస్‌రోడ్డు నుంచి హయత్‌నగర్ వరకు రెండు బస్సులు .
చిలకలగూడ నుంచి ఇబ్రహీంపట్నం వరకు .
మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి లింగంపల్లి వరకు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments