హైదరాబాద్‌లో ఇకపై 24 గంటలూ సిటీ బస్సులు.. ఏయే రూట్లలో అంటే..?

  • IndiaGlitz, [Saturday,May 14 2022]

హైదరాబాదీలకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై నగరంలో 24 గంటలూ సిటీ బస్సులు నడుస్తాయని వెల్లడించింది. ప్రయాణికుల డిమాండ్ , రద్దీగా ఉన్న మార్గాల్లో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ పేర్కొంది. ఇప్పటికే పలు మార్గాల్లో నైట్‌ బస్సులు ప్రయోగాత్మకంగా నడుపుతుండగా... ప్రయాణికుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో 24 గంటల పాటు బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు.

ఈ విధానం వల్ల.. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు అర్థరాత్రి వేళల్లో చేరుకునే ప్రయాణికులకు ఊరట కలగనుంది. అర్ధరాత్రి పూట దూర ప్రాంతాలకు చేరుకొనే ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లేందుకు భారీగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు ఈ సమయాల్లో మహిళలపై అత్యాచారాలు, దోపిడీలు కూడా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 24 గంటల పాటు సిటీ బస్సులు నడవడం వల్ల నేరాల రేటు తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ నైట్‌ బస్సుల్లో అన్ని రకాల పాస్‌లను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అలాగే 24 గంటల పాటు చెల్లుబాటయ్యే ట్రావెల్‌ యాజ్‌ యు లైక్‌ (టీఏవైఎల్‌) టిక్కెట్‌లని అనుమతిస్తారు. ఈ నైట్ బస్సులు డిపోలకు చేరుకొనే సమయానికి రెగ్యులర్‌ బస్సులు తిరిగి రోడ్డెక్కుతాయి. దీంతో 24 నాలుగు గంటల పాటు ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

నైట్ బస్సులు నడిచేది ఈ రూట్లలోనే:

సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి పటాన్‌చెరు వరకు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జాము వరకు 2 బస్సులు నడపనున్నారు.
సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ఆఫ్జల్‌గంజ్, మెహదీపట్నం, బోరబండ వరకు. ఈ మార్గాల్లో ప్రతి అరగంట నుంచి 45 నిమిషాలకు ఒక బస్సు సర్వీసు.
సికింద్రాబాద్‌ చిలకలగూడ క్రాస్‌రోడ్డు నుంచి హయత్‌నగర్‌ వరకు రెండు బస్సులు .
చిలకలగూడ నుంచి ఇబ్రహీంపట్నం వరకు .
మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచి లింగంపల్లి వరకు

More News

మీడియాలో వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల లిస్ట్‌ చక్కర్లు .. అలీకి ‘గుడ్‌న్యూస్’ లేనట్లేనా..?

త్వరలో దేశవ్యాప్తంగా ఖాళీ అవబోతున్న 57 రాజ్యసభ స్థానాలకు  సంబంధించి కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్‌ విడుదల చేసింది.

బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్.. క్షమాపణలకు డిమాండ్, 48 గంటలు డెడ్‌లైన్

తెలంగాణలో బీజేపీ దూకుడుతో రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు జాతీయ నేతలను రప్పిస్తూ కమలం పార్టీ టీఆర్ఎస్‌కు సవాల్ విసురుతోంది.

ఆర్ఆర్ఆర్ ఓటీటీ ట్రైలర్: థియేటర్‌లో లేని సీన్లు కూడా, ఆడియన్స్‌కి ఫుల్ మిల్స్

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘‘ఆర్ఆర్ఆర్’.

అంతా నా పుస్తకంలో వున్నట్లే, రవితేజ ‘‘క్రాక్’’ కథ నాదే .. పోలీసులకు రచయిత ఫిర్యాదు

రవితేజ, శృతిహాసన్‌లు హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘‘క్రాక్’’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

యూట్యూబర్‌ను వెంటాడి మరి చితక్కొట్టిన కరాటే కల్యాణ్.. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్

కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కరాటే కళ్యాణి.