‘ఇండియన్2’ నుంచి వాకౌట్ చేసిన స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్‌

  • IndiaGlitz, [Wednesday,February 10 2021]

సౌత్ ఇండియాలో భారీ చిత్రాల ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన డైరెక్ట‌ర్ శంక‌ర్ ఇప్పుడు ‘ఇండియన్2’ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతికేళ్ల ముందు కమల్‌హాస‌న్‌తో ఈయ‌న తెర‌కెక్కించిన ‘ఇండియన్’కు ఇది సీక్వెల్‌. కొంత భాగం చిత్రీక‌ర‌ణ కూడా పూర్తయ్యింది. అయితే ఈ సినిమాకు చాలా అవాంత‌రాలు ఏర్ప‌డుతున్నాయి. బ‌డ్జెట్ స‌మ‌స్య కార‌ణంగా ఆగిన ఈ సినిమా, కొన్నిరోజుల‌కు ప్రారంభమైంది. సెట్స్లో జ‌రిగిన క్రేన్ ప్ర‌మాదంలో ముగ్గురు స‌హాయ‌కులు చనిపోవ‌డంతో పోలీస్ కేసు కార‌ణంగా మ‌రికొన్నాళ్లు ఆగింది. తీరా స్టార్ట్ చేద్దామ‌ని అనుకుంటుండ‌గా కోవిడ్ ప్ర‌భావం స్టార్ట్ కావ‌డంతో ఆగింది. కోవిడ్ ప్ర‌భావం త‌ర్వాత ‘ఇండియన్2’ షూటింగ్ ఇంకా రీస్టార్ట్ కాలేదు.

ఒకానొక ద‌శ‌లో ‘ఇండియన్2’ సినిమా ఆగిపోయింద‌నే వార్త‌లు కూడా వినిపించాయి. అయితే ఫిబ్ర‌వ‌రి నుంచి షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంద‌రూ భావించారు. అయితే, ఇప్పుడు ఈ యూనిట్‌కు మ‌రో షాక్ త‌గిలింది. అదేంటంటే.. సినిమాకు ప‌నిచేస్తున్న స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ వెయిటింగ్‌ను భ‌రించ‌లేక‌.. ఉన్న ఇత‌ర క‌మిట్‌మెంట్స్ కార‌ణంగా ప్రాజెక్ట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌ట‌. ఇప్పుడు చిత్ర యూనిట్ మ‌రో కెమెరామెన్‌ను వెతికి ప‌ట్టుకునే ప‌నిలో ఉంది.

More News

న్యాయం కోరుతున్న అనుపమా పరమేశ్వరన్

అనుపమా పరమేశ్వరన్ బుధవారం ఉదయమే ఏడున్నరకు '18 పేజెస్' సినిమా షూటింగ్ స్పాట్ కి చేరుకున్నారు.

చిరంజీవి, బాబి సినిమా...ఇద్ద‌రిలో హీరోయిన్‌గా ఫైన‌ల్ అయ్యెదెవ‌రో?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’ షూటింగ్‌తో బిజి బిజీగా ఉన్నాడు. కాగా.. మ‌రో మూడు సినిమాల‌ను వ‌రుస లైన్‌లో పెట్టేసుకున్నాడు.

ప‌వ‌న్ 27 కోసం .. చార్మినార్ సెట్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 27వ చిత్రంగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

'నువ్వు-నేను' హీరోయిన్‌కి అబ్బాయి

'నువ్వు నేను' హీరోయిన్ అనిత హస్సనందనీ రెడ్డి ఇంట వారసుడు వచ్చాడు. దాంతో ఆమె భర్త రోహిత్ రెడ్డి, ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా వున్నారు.

పార్టీ వద్దని షర్మిలకు నచ్చజెప్పాం: సజ్జల

తెలంగాణలో ఊహించని రీతిలో దివంగత ముఖ్యమంత్రి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.