కంగ‌నాకు షాకిచ్చిన సినిమాటోగ్రాఫ‌ర్‌

ఓ స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్‌కు షాకిచ్చాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే చెప్పుకొచ్చాడు. ఇంత‌కూ ఆ స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ ఎవ‌రు? ఎందుకు కంగ‌నా ర‌నౌత్‌కు షాకిచ్చాడు.. అస‌లేం జ‌రిగింది? అనే వివ‌రాల్లోకెళ్తే.. సాధార‌ణంగా ఓ స్టార్ హీరో, హీరోయినో నిర్మాత‌ల‌కు తాము సినిమాలో ప‌నిచేయ‌లేమ‌ని ఏదో ఒక కార‌ణం చెప్పి త‌ప్పించుకుంటూ ఉంటారు. కానీ ఓ స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ త‌ను భారీ బాలీవుడ్ చిత్రంలో న‌టించ‌లేన‌ని చెప్పేశారు. ఆ స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ ఎవ‌రో కాదు.. పి.సి.శ్రీరాం. ఈయ‌నకు కంగ‌నా ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించే సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా అవ‌కాశం ద‌క్కింది. అయితే త‌న‌కు అస‌హ‌నంగా, ఇబ్బందిగా అనిపించ‌డంతో తాను ఆ సినిమా చేయాలేన‌ని మేక‌ర్స్‌కు ఆ విష‌యాన్ని చెప్పేశాడ‌ట‌. వారు ప‌రిస్థితిని అర్థం చేసుకుని స‌రేనన్నార‌ట‌. ఈ విష‌యాన్ని పి.సి.శ్రీరాం త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ‘కొన్నిసార్లు మ‌నం ఏదీ ఫీల్ అవుతామో అదే రైట్‌.. ఎంటైర్‌యూనిట్‌కు మంచి జ‌ర‌గాలి’ అని కూడా పి.సి.శ్రీరామ్ తన ట్వీట్‌లో వెల్ల‌డించారు.

అయితే కంగనా ప్ర‌స్తుతం బాలీవుడ్ మాఫియాకు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తింది. ఈ నేప‌థ్యంలో పి.సి.శ్రీరామ్ కంగ‌నా ర‌నౌత్ సినిమా నుండి త‌ప్పుకున్నార‌ని కొంద‌రు అంటున్నారు. అయితే కొంద‌రు పి.సి.శ్రీరామ్ చ‌ర్య‌ను స‌మ‌ర్ధిస్తున్నారు.