పవన్, రానా మూవీ నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్.. ఏమైంది?
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ షూటింగ్ ని ని దర్శకుడు సాగర్ చంద్ర తిగిరి ప్రారంభించారు. మలయాళీ బ్లాక్ బస్టర్ అయ్యప్పన్ కోషియం చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
జూలై 12న తిగిరి ప్రారంభమైన షూటింగ్ సడెన్ గా ఆగిపోయిందట. దీనికి కారణం సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ళ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ విభేదాల వల్ల ఆయన సడెన్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశారట.
ప్రసాద్ మురెళ్ళ ఈ చిత్రం నుంచి తప్పుకోవడానికి ఖచ్చితమైన కారణం అయితే తెలియడం లేదు. మొత్తానికి ప్రసాద్ మురెళ్ళ బాగా హర్ట్ అయినట్లు టాక్. ప్రసాద్ మురెళ్ళ టాలీవుడ్ లో సీనియర్ సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, కాటమరాయుడు చిత్రాలకు ప్రసాద్ పనిచేశారు.
ప్రసాద్ తప్పకోవడంతో చిత్ర యూనిట్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ని అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. చంద్రన్ ఇక నుంచి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించనున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కి జోడిగా నిత్యామీనన్, రానాకి జోడిగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవన్, రానా తొలిసారి కలసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com