పవన్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ మారాడు....

  • IndiaGlitz, [Thursday,September 22 2016]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం కాటమరాయుడు గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. సికింద్రాబాద్ లో చిత్రీకరణ ప్రారంభమైంది. సెప్టెంబర్ 24 నుండి పవన్ కల్యాణ్ టీంతో జాయిన్ అవుతున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత శృతిహాసన్ పవన్ తో జోడి కడుతున్న చిత్రమిదే. ఈ సినిమాకు ముందుగా సౌందర్ రాజన్ ను సినిమాటోగ్రాఫర్ గా అనుకున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ లోకి రావడానికి డిలే కావడంతో సౌందర్ రాజన్ సినిమా నుండి డ్రాప్ అయ్యాడని, అందుకని యూనిట్ గతంలో పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాకు వర్క్ చేసిన ప్రసాద్ మూరెళ్ళను సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.