రానా సినిమాకు సినిమాటోగ్రాఫర్ మారాడు
Send us your feedback to audioarticles@vaarta.com
`బాహుబలి`, `నేనే రాజు నేనే మంత్రి` వంటి వైవిధ్యమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన యాక్టర్ రానా దగ్గుబాటి ఆరోగ్య కారణాలతో కొన్ని రోజుల పాటు విశ్రాంతిని తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రానా దగ్గుబాటి త్వరలోనే `విరాటపర్వం` షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే సినిమాటోగ్రాపర్ జయకృష్ణకి `విరాటపర్వం` ప్రాజెక్ట్ ఆలస్యం కావడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నాడు.
ఆయన స్థానంలో `మహానటి` చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన డియోల్ షానెజ్‌ను కెమెరామెన్‌గా తీసుకున్నారట. ఇప్పటికే `విరాటపర్వం` షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కొంత మేర చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. ఇప్పుడు రానా పాల్గొనాల్సిన సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. త్వరలోనే ఈ షెడ్యూల్స్ రానాపై ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రియమణి కీలక పాత్రలో నటిస్తుంది. డి.సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com