ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ గుండెపోటుతో మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కె.వి.ఆనంద్(54) మృతి చెందారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఎన్నో హిట్ చిత్రాలకు కేవీ ఆనంద్ సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు. ‘తెన్నావిన్ కోంబత్’ అనే మలయాళీ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా 1994లో కె.వి.ఆనంద్ కెరీర్‌ను ఆరంభించారు. తమిళం, మలయాళం, తెలుగు, బాలీవుడ్ చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
తెలుగులో తెరకెక్కిన ‘పుణ్యభూమి నాదేశం’ సినిమాకు ఆయనే సినిమాటోగ్రాఫర్. అలాగే ‘తెన్నావిన్ కోంబత్’ చిత్రానికిగానూ కె.వి.ఆనంద్‌కు జాతీయ అవార్డు వరించింది. ప్రేమదేశం, ఒకేఒక్కడు తదితర చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇక దర్శకుడిగా కేవీ ఆనంద్ ప్రస్థానం కణా కండేన్ సినిమాతో ప్రారంభమైంది.. సూర్యతో వీడొక్కడే(అయాన్)తో హిట్ కొట్టి దర్శకుడిగా తనకంటూ దర్శకుడిగా ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే జీవాతో తెరకెక్కించిన రంగం(కో) సినిమాతో అటు తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ కొట్టి దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించారు.
తర్వాత బ్రదర్స్(మాట్రాన్), అనేకుడు(అనేగన్), కవన్, బందోబస్త్(కాప్పాన్) వంటి సూపర్ హిట్ చిత్రాలను కేవీ ఆనంద్ తెరకెక్కించారు. కె.వి.ఆనంద్ మృతిపై చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. చెన్నైలో పుట్టిన పెరిగిన కేవీ ఆనంద్ ఫ్రీ లాన్స్ ఫొటో జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేశారు. కల్కి, ఇండియా టుడే దిన పత్రికల్లో పనిచేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్‌ను కలిసి ఆయన శిష్యుడిగా సినిమాటోగ్రఫీలో శిష్యుడిగా మారారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. ఈయన సినిమాటోగ్రఫీ వహించిన తొలి చిత్రం ‘తెన్ మావిన్ కొంబాత్’ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments