ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ గుండెపోటుతో మృతి

  • IndiaGlitz, [Friday,April 30 2021]

ప్ర‌ముఖ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌(54) మృతి చెందారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కు ఆయనకు గుండెపోటు రావడంతో క‌న్నుమూశారు. ఎన్నో హిట్ చిత్రాలకు కేవీ ఆనంద్ సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు. ‘తెన్నావిన్‌ కోంబత్‌’ అనే మలయాళీ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా 1994లో కె.వి.ఆనంద్‌ కెరీర్‌ను ఆరంభించారు. తమిళం, మలయాళం, తెలుగు, బాలీవుడ్‌ చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

తెలుగులో తెరకెక్కిన ‘పుణ్యభూమి నాదేశం’ సినిమాకు ఆయనే సినిమాటోగ్రాఫర్‌. అలాగే ‘తెన్నావిన్‌ కోంబత్’ చిత్రానికిగానూ కె.వి.ఆనంద్‌కు జాతీయ అవార్డు వరించింది. ప్రేమ‌దేశం, ఒకేఒక్క‌డు తదితర చిత్రాలకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. ఇక దర్శకుడిగా కేవీ ఆనంద్ ప్రస్థానం క‌ణా కండేన్ సినిమాతో ప్రారంభమైంది.. సూర్య‌తో వీడొక్క‌డే(అయాన్‌)తో హిట్ కొట్టి దర్శకుడిగా తనకంటూ దర్శకుడిగా ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే జీవాతో తెర‌కెక్కించిన రంగం(కో) సినిమాతో అటు తమిళంతో పాటు తెలుగులోనూ సూప‌ర్ హిట్ కొట్టి ద‌ర్శ‌కుడిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

త‌ర్వాత బ్ర‌ద‌ర్స్‌(మాట్రాన్‌), అనేకుడు(అనేగ‌న్‌), కవ‌న్‌, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) వంటి సూపర్ హిట్ చిత్రాల‌ను కేవీ ఆనంద్ తెర‌కెక్కించారు. కె.వి.ఆనంద్ మృతిపై చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసింది. చెన్నైలో పుట్టిన పెరిగిన కేవీ ఆనంద్ ఫ్రీ లాన్స్ ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేశారు. క‌ల్కి, ఇండియా టుడే దిన ప‌త్రిక‌ల్లో ప‌నిచేశారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్‌ను క‌లిసి ఆయ‌న శిష్యుడిగా సినిమాటోగ్ర‌ఫీలో శిష్యుడిగా మారారు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారారు. ఈయ‌న సినిమాటోగ్ర‌ఫీ వ‌హించిన తొలి చిత్రం ‘తెన్ మావిన్ కొంబాత్’ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ వ‌చ్చింది.

More News

కేసీఆర్ ఏం కీలక ప్రకటన చేస్తారో.. టెన్షన్.. టెన్షన్..!

సీఎం కేసీఆర్‌కు యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ రిపోర్టులు మిశ్రమ ఫలితాన్నిచ్చాయి. ఈ విషయాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు తెలిపారు.

టీఎస్‌పీఎస్‌సీని క్లోజ్ చేయాలనుకుంటున్నారా?: హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ పబ్లిక్ కమిషన్‌కి 4 వారాల్లో చైర్మన్, సభ్యులను నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కూకట్‌పల్లి ఏటీఎం మిషన్‌లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు..

ఏటీఎం మిషన్‌లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి డబ్బులను దోచుకెళ్లిన ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగింది.

సాయం అందించాలని సోనూసూద్ పిలుపునకు విశేష స్పందన

లాక్‌డౌన్ మొదలు చేతికి ఎముక లేదన్నట్టుగా కష్టాల్లో ఉన్న జనానికి సాయం అందిస్తూ వస్తున్న ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ ప్రస్తుతం సాయం కోసం అర్థిస్తున్నారు.

అటు కేసీఆర్ సర్కార్.. ఇటు ఈసీపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్

తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.