ఫ్యాన్స్ వేరైనా సినీ స్టార్స్ ఒక్కటే అని నిరూపించిన సిని'మా' అవార్డ్స్
- IndiaGlitz, [Tuesday,June 14 2016]
ప్రతి సంవత్సరం సినీ తారలందరినీ ఒక్కతాటి పైకి తీసుకువచ్చి ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డ్స్ ఇస్తూ...ఎంతగానో ప్రొత్సహాం అందిస్తుంది మా టీవీ. ఈ సంవత్సరం సిని'మా' అవార్డ్స్ వేడుక ఇంతకు ముందు ఎన్నడూ జరగని విధంగా అంగరంగ వైభవంగా జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కళాతపస్వి కె.విశ్వనాథ్, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్, పూరి జగన్నాథ్, క్రిష్, హీరోలు నాగార్జున, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, సునీల్, సాయిధరమ్ తేజ్, నవదీప్...ఇలా ఇండస్ట్రీ అంతా ఒక్కతాటిపైకి వచ్చి 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ కి స్వాగతం చెప్పడం విశేషం.
ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ.... పరిశ్రమ పెద్దలు, కళాభిమానులు, అభిమానులు అందరూ ఇలా నాకు స్వాగతం చెప్పడం చాలా సంతోషంగా ఉంది. 150వ సినిమా చేస్తున్న తరుణంలో 9 సంవత్సరాల తర్వాత తెర పై పరిపూర్ణంగా కనిపించే సమయంలో నన్నుఈవిధంగా ఉత్సాహరిచిన స్టార్ ఇండియాకి ధన్యవాదాలు. ఇది ఎంతటి ప్రొత్సాహానిస్తుంది అంటే 150కి డబుల్ కిక్ స్టార్ట్ లా అనిపిస్తుంది. నేను చాలా అదృష్టవంతుడిని అనిపిస్తుంది. అందరూ ఆహ్వానిస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది అన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఎవరి స్టైల్ వారిది. వీరిద్దరికీ మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక వీరిద్దరూ మంచి డ్యాన్సర్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే... వీరిద్దరిని ఒకరి గురించి ఒకర్ని ఒక మాట చెప్పండి అంటే ఏం చెబుతారో అనే ఆసక్తి సగటు సినీ ప్రేక్షకుల్లో ఖచ్చితంగా ఉంటుంది. అంగరంగ వైభంగా జరిగిన సినిమా అవార్డ్స్ ఫంక్షన్ లో యాంకర్ సుమ సగటు సినీ ప్రేక్షకుడు ఎలా ఆలోచిస్తారో...అచ్చు అలాగే ఆలోచించి ఒకర్ని గురించి ఒకర్ని ఒక్కొ మాట చెప్పమని అడిగింది. అంతే... ఆడిటోరియంలో ఉన్న అందరిలో ఒకటే ఆసక్తి. ఎన్టీఆర్...బన్నిగురించి ఏం చెబుతాడు..? బన్ని...ఎన్టీఆర్ గురించి ఏం చెబుతాడు..? అని. ఎన్టీఆర్...నాకు తెలిసి కష్టపడి పైకి వచ్చిన ఏకైక వ్యక్తి ఈ జనరేషనలో బన్ని అని చాలా సిన్సియర్ గా చెప్పారు. అలాగే బన్ని..ఎన్టీఆర్ గురించి చెబుతూ రియల్ టాలెంట్ అంటే ఎన్టీఆర్ అని అంతే సిన్సియర్ గా చెప్పడం విశేషం.
టెంపర్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్ కి సినిమా అవార్డ్ అందచేసారు. ఈ అవార్డ్ ను ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ....ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, కృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఈ జనరేషన్ కి స్పూర్తి. వాళ్ల ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉంటాయి అన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిన్సియర్ గా ఎలాంటి ఈగో లేకుండా..చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్..లు స్పూర్తి అని చెప్పడం నిజంగా అభినందిచదగ్గ విషయం.
ఇక డెబ్యూ హీరోగా అఖిల్ కి వచ్చిన అవార్డ్ ను నాగార్జున చిరంజీవి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ...అఖిల్ తొలి సినిమా సరిగా ఆడలేదు. ఈ అవార్డ్ ను చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకున్నాను అని అఖిల్ కి చెబుతాను. అలా చెప్పడం వలన చిరంజీవి గారి నుంచి లెసెన్స్ నేర్చుకుంటాడని అనుకుంటున్నాను అన్నారు. నిజంగా ఇండస్ట్రీలో సినిమా ఫ్లాప్ అయినా... ఫ్లాప్ అయ్యింది అంటే చాలా మంది ఒప్పుకోరు. కానీ...నాగార్జున అలా కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అలా మాట్లాడడానికి ధైర్యం కావాలి. మంచి మనసు ఉండాలి. అఖిల్ సినిమా సరిగా ఆడలేదు అని అక్కడ చెప్పవలసిన అవసరం లేదు. అయినా చెప్పడం...తన కుమారుడు తన నుంచి కాకుండా తన తోటి హీరో చిరంజీవి గారి నుంచి లెసెన్స్ నేర్చుకుంటాడు అని చెప్పడం ద్వారా మేమంతా ఒక్కటే అని చెప్పకనే చెప్పారు నాగార్జున. అభిమానులు వేరే హీరోల అభిమానులతో గొడవ పడతారేమో కానీ...ఇండస్ట్రీలో హీరోలందరూ ఒక్కటే..! ఈ సత్యాన్ని మరోసారి నిరూపించింది సినిమా అవార్డ్స్ ఫంక్షన్..!