మాటీవీలో ఈరోజు రేపు సినిమా అవార్డ్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
చిరు చిందేస్తే..? మెగాస్టార్ రియల్ గా సూపర్ హిట్ సాంగ్ కి గ్రేసీ మూమెంట్స్ ఇస్తే..? అని రకరకాల శీర్షికలతో సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలో మారుమోగిపోయిన టాపిక్ సినిమా అవార్డ్స్ వేదిక పైన చిరంజీవి డ్యాన్స్. ఎక్కడ విన్నా..ఎక్కడ చూసినా మెగాస్టార్ డిస్కషనే జరిగింది. ప్రేక్షకులకు శాంపుల్ రుచి చూపించిన మెగా పర్ ఫార్మెన్స్ ను పూర్తి స్ధాయిలో...కనువిందు చేసే స్ధాయిలో...మరెంతో అద్భుతమైన వినోదాన్ని జోడించి సినిమా అవార్డ్స్ ఈవెంట్ ను ఈరోజు, రేపు మాటీవీ తమ ప్రియ ప్రేక్షకులకు అందిస్తోంది. అవార్డ్స్ లో, పర్ ఫార్మెన్స్ ల్లో సాంకేతిక ప్రమాణాల్లో ఉన్నత స్ధాయిలో సినిమా అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగించబోతుంది.
మోస్ట్ హాపెనింగ్ హీరోలు, గ్లామరస్ హీరోయిన్స్ ఉర్రూతలూగించేలా స్టెప్స్ వేసిన పాటలు, గిలిగింతలు పెట్టే కామెడీ స్కిట్స్..ఇంకా మరుపురాని మెగా సంబరంతో పాటు వినోదానికి కొత్త నిర్వచనం ఇచ్చే పర్ ఫార్మెన్స్ లు ఈ ఏడాది అవార్డలు ప్రత్యేకం. మాటీవీలో ఈరోజు సాయంత్రం 6గంటలకు, రేపు సాయంత్రం 6 గంటలకు రెండు భాగాలుగా ప్రసారం అవుతుంది. ఎన్నో హైలైట్స్, మరెన్నో ఎట్రాక్షన్స్, ఇంకెన్నో సర్ ప్రైజస్ కలగలసిన ఈ ఈవెంట్ ఏ రోజుకారోజు దేనికదే ప్రత్యేకంగా రెండు రోజులు మా వీక్షకులకు పరిపూర్ణమైన విందు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments