కన్నుల పండుగలా అత్యంత వైభవంగా జరిగిన సిని'మా' అవార్డ్స్ ప్రదానోత్సవం
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా ప్రపంచంలో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంతగానో ప్రొత్సహిస్తున్న ఛానల్ మాటీవీ. ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా సినిమా అవార్డుల పండుగను అత్యంత వైభంగా నిర్వహించింది. స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (స్టార్ టీవీ) లో భాగమైన మా ఛానల్ నెట్ వర్క్ ఈ సంవత్సరం అవార్డుల ఉత్సవాన్ని మరింత ఉన్నత స్ధాయిలో ప్రేక్షకులకు అందించింది. ఇంతకు ముందు జరగని విధంగా అద్భుతం అనేలా ఈ వేడుకను నిర్వహించింది. అభిమాన కథానాయకుల ప్రసంగాలు...అందాల తారల నృత్యాలు... ప్రేక్షకుల్ని ఒక సరికొత్త లోకంలో విహరింపచేసేలా చేసింది సినిమా అవార్డ్స్ వేడుక అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పై డ్యాన్స్ చేయడంతో ప్రేక్షకుల స్పందనతో ఆడిటోరియం ఒక్కసారిగా అదిరిపోయింది. ఇది ఈ ఈవెంట్ కే హైలెట్ గా నిలిచి... మెగా ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే కాకుండా ప్రేక్షకలోకానికి కలకాలం గుర్తుండిపోయేలా మధురానుభూతిని అందించింది.
మనం ఏ పని చేసినా విఘ్నాలు లేకుండా ఉండడం కోసం గణేశుడుకి పూజ చేసి కొత్త పని ప్రారంభిస్తాం కదా...సినిమా అవార్డ్స్ వేడుకను కూడా గణేషుడు పై సురేష్ వర్మ టీమ్ చేసిన డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ తోనే ప్రారంభించారు. అలా...గణేష్ సాంగ్ తో ప్రారంభమైన ఈ వేడుకలో ప్రేక్షకులకు ప్రారంభంలోనే చిన్న సర్ ఫ్రైజ్ అందించింది. అది ఏమిటంటే...ఎప్పుడూ సుమ, ఆలీ యాంకరింగ్ చేసారు. ఈసారి ఆలీ ప్లేస్ లో కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ యాంకరింగ్ చేయడం ఓ విశేషమైతే... మర్యాద రామన్న స్టైల్ లో సైకిల్ తొక్కుతూ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ని సర్ ఫ్రైజ్ చేయడం మరో విశేషం.
ఈ వేడుకలో దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ....నంది అవార్డ్స్ ను ప్రభుత్వం మరచిపోయింది. మేము కూడా మరిచపోయాం. మాటీవి అవార్డ్స్ ఇస్తుంటే నంది అవార్డ్ తీసుకున్నంత ఆనందంగా ఉంటుంది. మాటీవి లిఫ్ట్ ఎక్కి పైకి రాలేదు. మెట్లు ఎక్కిపైకి వచ్చి అగ్ర సంస్థగా నిలిచింది. ఈ సంస్థ మరింతగా రాణించాలని కోరుకుంటూ విజేతలందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను అన్నారు.
నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ...మాటీవీ మేనేజ్ మెంట్ మారింది. మేము స్టార్ట్ చేసిన సినిమా అవార్డ్స్ ను కంటిన్యూ చేస్తున్నందుకు థ్యాంక్స్. మాటీవీతో వండర్ ఫుల్ జర్నీ. ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా పాత్రలు స్ర్కీన్ పై కనిపించి మాట్లాడడం...వాటికి సమాధానాలు చెబుతూ చిరు ఎంట్రీ ఇవ్వడం కొత్తగా చాలా బాగుంది ఇంకా చెప్పాలంటే...అదిరింది. 150వ సినిమా ఎలా ఉండాలో...చిరు పాత్రలు చిరంజీవికి చెప్పడం విశేషం. ముందుగా నువ్వు ప్రాణం పోసిన పాత్ర అంటూ ఇంద్ర చిత్రంలోని ఇంద్రసేనారెడ్డి ఎంట్రీ ఇచ్చి...ఇన్నాళ్ల తర్వాత మళ్లీ నువ్వు ఓ చిత్రం చేస్తున్నావు ఆ చిత్రం చరిత్రలో నిలిచిపోయే చిత్రం అవ్వాలి. అందుకు నాదో సలహా...సినిమా అనేది ప్రజలకు మంచి చెప్పాలి. అందులోను గుండెల్లో పెట్టుకుని అభిమానించిన ప్రజలకు మంచి సందేశం అందించాలి. ఆలోచింపచేయాలి...ఇది మరచిపోవు గా..అనగానే చిరంజీవి సమాధానం ఇస్తూ...రాయలసీమకు నీళ్లు తెచ్చిన నీ పాత్ర స్పూర్తితో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మనసుని కదిలించే రైతుల కథే 150వ చిత్రం అనగానే ఇంద్ర పాత్ర చాలా సంతోషం అంటోంది. ఆతర్వాత ముఠామేస్త్రి చిత్రంలోని బోస్ పాత్ర స్ర్కీన్ పై ఎంట్రీ ఇచ్చి..నమస్తే బాసు అనగానే చిరంజీవి ఓ నమస్తే బోసు...అంటూ సమాధానం ఇచ్చారు. బాసూ...మీ ఆశయాలు.. సిద్దాంతాలు.. ఎలా ఉన్నా మాకు కావల్సింది మాస్..! మాస్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకో మాకు అది చాలు...అనగానే మన పల్సే మాసు...అది మిస్ అయ్యే ప్రసక్తే లేదు అని చిరంజీవి అనగానే ఓ సూపర్ బాసు...సూపర్.. చాలు బాసు..అంటోంది బోసు పాత్ర.
ఆతర్వాత రాజు పాత్ర ఎంట్రీ ఇచ్చి...మనోడు చెప్పినవన్నీ ఉండాలి కానండీ దానికి తోడు..ఆ సినిమాలో మాంచి రొమాన్స్ కూడా ఉండాలి అనగానే చిరంజీవి తప్పకుండా రాజు రొమాన్స్ ఉంటుంది. హీరోయిన్ తో ఆటా..పాట కూడా ఉంటుంది అనగానే రాజు పాత్ర చాలు...మాస్టారు..కుమ్మేయండి ఆల్ ది బెస్ట్ అంటోంది. ఆతర్వాత శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ పాత్ర ఎంట్రీ ఇచ్చి ఏమిటి అంతా కలిసి సలహాలు ఇచ్చేస్తున్నారు. మీ కథ, సెంటిమెంటు, మాసు, రొమాన్స్ తో పాటు మాకు కావల్సింది కామెడీ అమ్మా...ముందు అది ఉందో లేదో చెప్పండి అనగానే...చంటబ్బాయి నుంచి నీదాకా ఎప్పుడైనా కామెడీని వదిలిపెట్టానా శంకర్..అనగానే అంటే జీవితంలో ఉన్న కష్టాలకు కామెడి అనేది మంచి టానిక్ అని డాక్టర్ గా నా సలహా అనగానే... రాజు పాత్ర ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని అదిరింది డాక్టరు అంటాడు. దీనికి సమాధానంగా చిరంజీవి మీరందరూ కోరుకున్నవి అన్నీ రాబోయే సినిమాలో ఉంటాయి. ఆ పాత్ర మీలాగే చరిత్రలో నిలిచిపోయే పాత్ర అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుంది ఓకే నా అనగానే...శభాష్.. చాలా సంతోషం..సూపర్ బాసు...దిల్ ఖుషీ అయ్యింది భయ్యా అంటూ చిరు పాత్రలు చెప్పగానే థ్యాంక్స్ ఆల్ అంటూ పాత్రలకు బై బై చెప్పడం విశేషంగా ఆకట్టుకుంది.
పాత్రలతో చిరు సంభాషణ పూర్తయిన తర్వాత చిరు స్టేజ్ పై ఉండగా చిరు గ్యాంగ్ శ్రీకాంత్, సునీల్, నవదీప్, సాయిధరమ్ తేజ్...ఎంట్రీ ఇచ్చారు. శ్రీకాంత్ 9 ఏళ్ల తర్వాత తెర పై చూడబోతున్నాం అంటే మాకే ఎక్సైటింగ్ గా ఉంది ఇక ప్రేక్షకులు అభిమానుల సంగతి చెప్పాలా...అని శ్రీకాంత్ అనగా థ్యాంక్స్ శ్రీకాంత్ అంటూ చిరు సమాధానం. ఆ వెంటనే సునీల్ అన్నయ్యా...చిన్న కోరిక అనగానే చెప్పు సునీల్ అని చిరు అనడం...గ్యాంగ్ మొత్తం మంచి ఊపు మీద ఉన్నాం. గ్యాంగ్ లీడర్ తో కలిసి చిన్న స్టెప్ అనగానే..చిరు నో అనడం..శ్రీకాంత్ అన్నా స్టెప్ వేయాలన్నా అనగానే చిరు ఓకే అంటూ... గ్యాంగ్ లీడర్ సినిమాలో టైటిల్ సాంగ్ కి డ్యాన్స్ చిరు గ్యాంగ్ వేయడంతో ఒక్కసారిగా ఆడిటోరియం అదిరిపోయింది. ఇక చిరు ఫ్యామిలీ అయితే... ఎంతలా ఎంజాయ్ చేసుంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా చిరు స్టేజ్ పై డ్యాన్స్ వేస్తుంటే చిరు తనయుడు చరణ్ అలా చూస్తుండిపోయాడు. అంతే కాదండోయ్...వెంటనే చరణ్ స్టేజ్ పైకి వెళ్లి తండ్రికి బిగ్ హగ్ ఇవ్వడంతో పాటు వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం విశేషం. ఈ ఈవెంట్ చిరు ఫ్యామిలీ మెంబర్స్ ని మాత్రమే కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని టచ్ చేసింది.
చిరంజీవి మాట్లాడుతూ....ఎన్ని సినిమాల్లో నటించినా..ఫస్ట్ సినిమా ముహుర్తం రోజున ఎంత టెన్షన్ పడ్డానో..149 చిత్రాలకు అదే టెన్షన్. మళ్లీ ఈ స్టేజ్ పై అదే టెన్షన్ అనేది వాస్తవం. డెడికేటెడ్ గా వర్క్ చేసే కళాకారులందరికీ అలా ఉంటుంది అనుకుంటున్నాను. పరిశ్రమ పెద్దలు, కళాభిమానులు, అభిమానులు అందరూ ఇలా నాకు స్వాగతం చెప్పడం చాలా సంతోషంగా ఉంది. 150వ సినిమా చేస్తున్న తరుణంలో 9 సంవత్సరాల తర్వాత తెర పై పరిపూర్ణంగా కనిపించే సమయంలో నన్నుఈవిధంగా ఉత్సాహరిచిన స్టార్ ఇండియాకి ధన్యవాదాలు. ఇది ఎంతటి ప్రొత్సాహానిస్తుంది అంటే 150కి డబుల్ కిక్ స్టార్ట్ లా అనిపిస్తుంది. నేను చాలా అదృష్టవంతుడిని అనిపిస్తుంది. అందరూ ఆహ్వానిస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. సునీల్, సాయిధరమ్ తేజ్, దీవిశ్రీప్రసాద్, నవదీప్, సాయికుమార్, తనికెళ్ల భరణి, చిన్నారులు వీళ్లందరి కృషితో చేసిన ఈ కార్యక్రమం కన్నుల పండుగలా జరగడం ఆనందంగా ఉంది. మాటీవీ ఫంక్షన్ ఏదైనా మా కుటుంబంలో జరిగే ఫంక్షన్ లా ఫీలవుతుంటాం. మాటీవీతో వ్యాపారపరంగా, వ్యక్తిగతంగా సంబంధం ఉంది. గత ఛైర్మెన్ నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున, అల్లు అరవింద్ మా టీవీని ఈ స్ధాయికి తీసుకువచ్చారు. స్టార్ వాళ్లు మాటీవీని కొనుగోలు చేసారు. అయినా మాటీవీ పై ఆప్యాయత పోలేదు. ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ లో తెలుగు ప్రేక్షకులు 30% మాటీవీని చూస్తుండడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నెం 1 ఛానల్ మాటీవీని అభినందిస్తున్నాను. మరింతగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. 150వ చిత్రం చేస్తూ ఉద్విగ్నతకు లోనవుతున్నాను. త్వరలో మీ ఆశీస్సులు కోసం మీ ముందుకు వస్తాను అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ...చిరంజీవి గారు జర్నీ ఎలా స్టార్ట్ చేసారు..ఈరోజు ఏ స్ధాయిలో ఉన్నారు. ఈ జనరేషన్ కి ఇన్ స్పిరేషన్ చిరంజీవి గారు . చిరంజీవి గారి 150వ సినిమా తెలుగు ఇండస్ట్రీలో నెం 1 సినిమా కావాలని కోరుకుంటున్నాను. ఏక్టర్ కి అవార్డ్ అనేది చాలా ముఖ్యం. అవార్డ్ ఇచ్చిన ప్రొత్సాహంతో ఇంకా మంచి పాత్రలు చేయాలనిపిస్తుంటుంది. డెబ్యూ ఏక్టర్ గా అఖిల్ కి వచ్చిన ఈ అవార్డ్ ను చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకున్నానని అఖిల్ కి చెబుతాను. చిరంజీవి గారు నుంచి పాఠాలు నేర్చుకుంటాడని ఆశిస్తున్నాను అన్నారు.
అమల మాట్లాడుతూ...అఖిల్ హైదరాబాద్ లో లేకపోవడం వలన ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. స్పెషల్ మూమెంట్ ని మిస్ అయ్యాడు. థ్యాంక్స్ టు మాటీవి అన్నారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...నటననలో ఎన్నిరసాలు ఉన్నా...యాక్షన్, కామెడీ ఈ రెండు పర్మినెంట్ గా ఉంటాయి. ఈ రెండింటిని అద్భుతంగా పండించి స్టార్ డమ్ తీసుకువచ్చారు నా మిత్రుడు చిరంజీవి. నాకు ఆప్త మిత్రుడు, నా వెల్ విషర్. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉన్నాం. నటనకి లాంగ్వేజ్, ఏజ్ అనే తేడా లేదు. 150 కాదు..ఇంకో 150 చేయడానికి రెడీ. మనం చేయించుకోవాలి అంతే. చిరంజీవిని చూడగానే గర్వంగా ఫీలవుతుంటాను. హి ఈజ్ పవర్ ఆఫ్ మాస్. స్టార్స్ కే స్టార్ మెగాస్టార్ అన్నారు.
స్టార్ ఇండియా మేనేజర్ మాధవన్ మాట్లాడుతూ...సినిమా అవార్డ్స్ ఫంక్షన్ లో చిరంజీవి గార్కి ఈవిధంగా చిరు సత్కారం చేస్తామని చెప్పగా ఫస్ట్ చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించారు. ఆతర్వాత మళ్లీ రిక్వెస్ట్ చేయడంతో అంగీకరించారు. ఈ వేడుకలో చిరంజీగారు స్టేజ్ పై డ్యాన్స్ చేయడంతో ఇది ఒక గ్రేట్ షో అయ్యింది. చిరంజీవి గారి 150వ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాలి ఆల్ ది బెస్ట్ టు చిరంజీవి గారు అన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ...ఒక అద్భుతమైన దర్శకుడు అయ్యుండి...నేను ఒక కథ విన్నాను ఆ కథతో సినిమా చేస్తే బాగుంటుంది అనగానే..గొప్ప కథ రాయగల స్ధాయి ఉండి కూడా వంశీ కథతో టెంపర్ సినిమా చేసిన పూరి జగన్నాథ్ కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, కృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు మా జనరేషన్ కి ఇన్ స్పిరేషన్. మా జనరేషన్ కి ఎప్పుడూ వాళ్ల ఆశీస్సులు ఉంటాయి అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ...రుద్రమదేవి చిత్రానికి గాను అవార్డ్ అందుకోవడం ఆనందంగా ఉంది. గుణశేఖర్ గారు & టీమ్ కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఈ చిత్రంలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడానికి రైటర్ రాజసింహ నాకు బాగా హెల్ప్ చేసారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు మైండ్ లో ఒకటే ఉండేది. అది ఏమిటంటే... ఆంధ్రప్రదేశ్ చెందిన నేను తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతుంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రెండు చోట్ల థియేటర్లో ప్రేక్షకులు క్లాప్స్ కొట్టాలి అనుకుని వర్క్ చేసాను. నేను అనుకున్నట్టుగానే ఆదరించడం సంతోషంగా ఉంది అన్నారు.
రానా మాట్లాడుతూ...మా తాత బాహుబలి చిత్రాన్ని చూడలేదు. నాకు అదో లేటుగా ఉండేది. అయితే తాత ఆశీస్సులతోనే ఈ అవార్డ్ వచ్చింది అనుకుంటున్నాను. రాజమౌళి భారతదేశం గర్వించదగ్గ బాహుబలి చిత్రాన్ని అందించారు. బాహుబలి 2 కోసం వెయిట్ చేస్తున్నాను. చిరంజీవి గారి చేతలు మీదుగా అవార్డ్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ...స్టోరీ రైటర్ గా, డైలాగ్ రైటర్ గా నాకు చాలా అవార్డ్స్ రావాలి. కానీ.. రాలేదు. ఎందుకు రాలేదు అనేది అప్రస్తుతం. నేను మాటీవీ వాళ్లను ఇన్ ప్లూయిన్స్ చేయలేదు. వాళ్లే సిన్సియర్ గా ఫోన్ చేసారు. అందుకే సిన్సియర్ గా ఈ ఫంక్షన్ కి వచ్చాను. ఏడవ తరగతి చదువుతున్నప్పుడే స్టేజ్ పై నటించాను. యూనివర్శిటీలో కూడా స్టేజ్ పై నటించాను. అయితే ఎప్పుడూ కూడా ఆర్టిస్ట్ అవుతాను అని అనుకోలేదు. మెంటల్ కృష్ణ సినిమా చేస్తున్నపుడు నాలో నటుడు ఉన్నాడనిపించింది. క్రిష్ వేదం సినిమాలో మంచి పాత్ర ఇచ్చాడు. నాయక్ సినిమా ఆర్టిస్ట్ గా టర్నింగ్ పాయంట్ అని చెప్పచ్చు. చరణ్... నాయక్ సినిమా రష్ చూసి నాన్నగారు నేను చేసిన పాత్రను మళ్లీ మళ్లీ చూసి నవ్వుకునే వారని చెప్పాడు. మంచి పాత్ర ఇచ్చిన చరణ్ కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. అలాగే రేసుగుర్రం చిత్రాన్ని ఇతర భాషలో డబ్ చేసారు. వేరే రాష్టం వెళ్లినప్పుడు రేసుగుర్రంలో నటించారు కదా అంటూ నన్ను అభినందిస్తుండడం ఆనందంగా ఉంది. నాకు మంచి పేరు తీసుకువచ్చిన మరో చిత్రం టెంపర్. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చి ఈ అవార్డ్ రావడానికి కారణమైన హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ పూరి జగన్నాథ్, రైటర్ వక్కంతం వంశీ, నిర్మాత బండ్ల గణేష్ కి థ్యాంక్స్ అన్నారు.
రాఘవేంద్రరావు మాట్లాడుతూ...బాహుబలి చిత్రానికి నేను సమర్పకుడిగా వ్యవహరించినా...అందులో నా పాత్ర ఏమీ లేదు. బాహుబలి చరిత్రగా నిలిచిపోయింది. ఈ చిత్రానికి నిజమైన బాహుబలి రాజమౌళియే అన్నారు.
నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ...నాలుగు సంవత్సరాలు కష్టపడి బాహుబలి చిత్రాన్ని నిర్మించాం. బాహుబలి వండర్ ఫుల్ ఫిల్మ్. బాహుబలి 2 కోసం అదరిలానే వెయిట్ చేస్తున్నాం అన్నారు.
గీత రచయత సిరివెన్నల సీతారామశాస్త్రి మాట్లాడుతూ...కంచె సినిమాకి పాటలు రాయడం గొప్ప అవకాశం. ఈ చిత్రానికి నేను రాసిన పాటలు అంతగా రావడానికి కారణమైన సంగీత దర్శకుడు చిరంతన్ భట్, డైరెక్టర్ క్రిష్ కి థ్యాంక్స్. ఈ అవార్డ్ ను దాసరి గారి చేతుల మీదుగా అందుకోవడంతో ఆనందం రెట్టింపు అయ్యింది అన్నారు.
డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ...కథ కంచెకి వెళ్లింది అంటారు. కానీ..నేను కంచె కి రాసిన కథకు అవార్డ్ తీసుకువచ్చింది. నేను ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేసాను. ఈ నాలుగు సినిమాలకు మాటీవీ అవార్డ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అలాగే నేను రాసిన కథలను నమ్మి నాతో చిత్రాలను నిర్మించిన నా నిర్మాతలకు థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...జీవితం ఎవర్నీ వదలదు. అందరి సరదా తీర్చేస్తుంది. ఇదే డైలాగ్ గా టెంపర్ లో రాసాను. టెంపర్ సినిమాకి గాను డైలాగ్ రైటర్ గా అవార్డ్ రావడం ఆనందంగా ఉంది. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు. ఈ అవార్డ్ లో వంశీకి కూడా భాగం ఉంది అన్నారు.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ...నా తొలి చిత్రానికే అవార్డ్ రావడం చాలా ఎక్సైటైడ్ గా ఫీలవుతున్నాను. నన్ను గుర్తించి మాటీవీ అవార్డ్ ఇవ్వడం ఆనందంగా ఉంది. అవార్డ్ రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ...చిరంజీవి గారి డ్యాన్స్ చూస్తుంటే మతిపోయింది. చిరంజీవి గారు, చరణ్ చేతుల మీదుగా అవార్డ్ అందుకోవడం సంతోషంగా ఉంది. నన్ను ప్రొత్సహిస్తున్న అందరికీ థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ...శ్రీమంతుడు కథ అంటే నాకు ఎంతో ఇష్టం. నాకంటే ఎక్కువ మహేష్, చిత్ర నిర్మాతలు ఈ కథను నమ్మారు. అలాగే దేవిశ్రీప్రసాద్, ఎడిటర్ చంటి గారు కూడా ఈ కథను నమ్మారు. శ్రీమంతుడు చిత్రానికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తీసుకుంటాను అన్నారు.
ఛార్మి మాట్లాడుతూ...జ్యోతిలక్ష్మి నాకు స్పెషల్ ఫిల్మ్. సినిమా అవార్డ్స్ పేరుతో అవార్డ్స్ ఇచ్చి ప్రొత్సహిస్తున్న మాటీవికి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. పూరి జగన్నాథ్ గారు ఈ చిత్రాన్ని 32 రోజులు పూర్తి చేసారు.రోజుకి 6 నుంచి 7 సీన్స్ చిత్రీకరించేవారు. ఈ అవార్డ్ ని జ్యోతిలక్ష్మి టీమ్ కి అంకితం ఇస్తున్నాను అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...చిరంజీవి గారు గురించి చేసిన ప్రొగ్రామ్ చూస్తుంటే 150వ సినిమాకి ట్రైలర్ చూపించినట్టు అనిపించింది. చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్ లు అబ్జర్వ్ చేసాను. అందరి ఫేసులు వెలిగిపోతున్నాయి. మాటీవీతో మా అనుబంధం ఇలానే ఉంటుంది అన్నారు.
గుణ శేఖర్ మాట్లాడుతూ....టెక్నీషియన్ గా నేను 70 కోట్లు పెట్టి రుద్రమదేవి చిత్రాన్ని నిర్మించాను అంటే తెలుగు ఇండస్ట్రీ ఇచ్చిన ప్రొత్సాహమే కారణం. ఈ చిత్రానికి బన్ని ప్రాణ ప్రతిష్ట చేసాడు. ఈ అవార్డ్ ను రుద్రమదేవి యూనిట్ కి అంకితం ఇస్తున్నాను. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అయినా ఈ చిత్రంలో నటించిన బన్నికి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. అలాగే అనుష్క అవార్డ్ ను అనుష్క అమ్మగార్కి అంకితం ఇస్తున్నాం అన్నారు.
డైరెక్టర్ అనిల్ రవిపూడి మాట్లాడుతూ...ఈ అవార్డ్ నా తొలి అవార్డ్. నాకు తొలి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గార్కి రుణపడి ఉంటాను. పటాస్, సుప్రీమ్ చిత్రాలతో సక్సెస్ సాధించడంతో ఎంటర్ టైన్మెంట్ బాగా డీల్ చేస్తున్నాను అంటున్నారు. దానికి కారణం జంధ్యాల గారు. ఎందుకంటే నేను జంథ్యాల గారి ఫ్యాన్ ని. ఈ అవార్డ్ ని జంథ్యాల గార్కి అంకితం ఇస్తున్నాను అన్నారు.
కమెడియన్ పృథ్వీ మాట్లాడుతూ...మా తాడేపల్లిగూడెంలో లెక్కలు మాస్టార్ మేనరిజమ్ ని ఫాలో అయ్యాను. బెంగాల్ టైగర్ లో అదే మేనేరిజమ్ ని పెట్టాం. ఎప్పుడైనా అవార్డ్ వస్తుందా అనుకునేవాడిని. ఫస్ట్ టైమ్ అవార్డ్ అందుకున్నాను. ఈ అవార్డ్ ను నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రభాకర్ రెడ్డి గారికి అంకితం ఇస్తున్నాను అన్నారు.
సిని'మా' అవార్డ్స్ హైలైట్స్...
ఆలీ ప్లేస్ లో కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ యాంకరింగ్ చేయడం ఓ విశేషమైతే... మర్యాద రామన్న స్టైల్ లో సైకిల్ తొక్కుతూ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ కి సర్ ఫ్రైజ్ చేయడం మరో విశేషం.
చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్ అవార్డ్ అందుకోవడం విశేషం
ప్రతి సంవత్సరం ఏదో సినిమాని స్పూఫ్ చేసే ఆలీ...ఈసారి కబాలి చిత్రంలో రజనీ గెటప్ లో కనిపించి కడుపుబ్బా నవ్వించారు. అలాగే ఆలీ స్టేజ్ పై డ్యాన్స్ చేయడం విశేషం.
ఎన్టీఆర్ ని...బన్ని గురించి ఒక్క మాట చెప్పమంటే... ఈ జనరేషన్లో కష్టపడి పైకి వచ్చిన ఏకైక వ్యక్తి బన్ని అని చెప్పడం విశేషం.
బన్నిని ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే...రియల్ టాలెంట్ అంటే ఎన్టీఆర్ అని చెప్పడం విశేషం.
గుణ శేఖర్ బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి పేరు ఎనౌన్స్ చేస్తూ...రాజమౌళి పేరు ఎనౌన్స్ చేయడం గర్వంగాను...గౌరవంగా ఉంది అన్నారు.
సినిమా అవార్డ్స్ వేడక అంతటికీ హైలైట్ అంటే....చిరంజీవి స్ర్కీన్ పై తను నటించిన పాత్రలతో సంభాషించడం ఓ విశేషం అయితే...గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ కి డ్యాన్స్ చేయడం మరో విశేషం.
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ముఠామేస్త్రి పాటకు డ్యాన్స్ చేయడం అందర్నీ ఆకట్టుకుంది.
నాగార్జున, అమల అఖిల్ అవార్డ్ చిరంజీవి చేతుల మీదుగా అందుకోవడం....అఖిల్ కి చిరంజీవి గారి చేతులు మీదుగా అందుకున్నాని చెబుతాను. అలా చెప్పడం ద్వారా పాఠాలు నేర్చుకుంటాడని నాగార్జున అనడం విశేషం.
హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, శ్రియ స్టేజ్ పర్ ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
సినిమా అవార్డ్స్ విజేతల వివరాలు..
ఉత్తమ చిత్రం - బాహుబలి
ఉత్తమ నటుడు - ఎన్టీఆర్ (టెంపర్)
ఉత్తమ నటి - అనుష్క (రుద్రమదేవి)
ఉత్తమ విలన్ - రానా (బాహుబలి)
ఉత్తమ డైరెక్టర్ - రాజమౌళి (బాహుబలి)
ఉత్తమ స్ర్కీన్ ప్లే - సుకుమార్ (కుమారి 21 ఎఫ్)
ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీప్రసాద్ (సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, కుమారి 21 ఎఫ్)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ - సబు సైరల్ (బాహుబలి)
ఉత్తమ విఎఫ్ఎక్స్ - శ్రీనివాస మోహన్ (బాహుబలి)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్ (బాహుబలి)
ఉత్తమ డైలాగ్ రైటర్ - పూరి జగన్నాథ్ (టెంపర్)
ఉత్తమ కథా రచయిత - క్రిష్ (కంచె)
ఉత్తమ ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (శ్రీమంతుడు & బాహుబలి)
ఉత్తమ ఫైట్ మాస్టర్ - పీటర్ హెయిన్స్ (బాహుబలి)
ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - చిరాంతన్ భట్ (కంచె)
ఉత్తమ చిత్రం (జ్యూరీ) - శ్రీమంతుడు
ఉత్తమ నటుడు (జ్యూరీ) - అల్లు అర్జున్ (రుద్రమదేవి)
ఉత్తమ నటి (జ్యూరీ) - ఛార్మి (జ్యోతిలక్ష్మి)
ఉత్తమ డైరెక్టర్ (జ్యూరీ) - కొరటాల శివ (శ్రీమంతుడు)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (జ్యూరీ) - ఎం.ఎం.కీరవాణి (బాహుబలి)
ఉత్తమ సపోర్టింగ్ ఏక్టర్ - పోసాని కృష్ణమురళి (టెంపర్)
ఉత్తమ సపోర్టింగ్ ఏక్టరస్ - రమ్యకృష్ణ (బాహుబలి)
స్పెషల్ అప్రిషేషన్ అవార్డ్ - క్రిష్ (కంచె)
స్పెషల్ అప్రిషేషన్ అవార్డ్ - గుణశేఖర్ (రుద్రమదేవి)
స్పెషల్ అప్రిషేషన్ అవార్డ్ - రాజేంద్రప్రసాద్ (సన్నాఫ్ సత్యమూర్తి & శ్రీమంతుడు)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు - అనిల్ రవిపూడి (పటాస్)
ఉత్తమ తొలి చిత్ర నటుడు - అఖిల్ అక్కినేని (అఖిల్)
ఉత్తమ తొలి చిత్రం హీరోయిన్ - ప్రగ్యా జైస్వాల్ (కంచె)
ఉత్తమ కామిక్ ఏక్టర్ - పృధ్వీ (బెంగాల్ టైగర్)
ఉత్తమ గాయకుడు - కార్తీక్ (బాహుబలి)
ఉత్తమ గాయని - రమ్య బెహర (బాహుబలి)
ఉత్తమ గీత రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి (కంచె)
ఉత్తమ కొరియోగ్రాఫర్ - ప్రేమ్ రక్షిత్ (బాహుబలి)
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout