'సినిమా చూపిస్త మావ' మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Friday,August 14 2015]

ఉయ్యాలా జంపాలా చిత్రం సూపర్ సక్సెస్ తో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్, అవికా గోర్ లు మరోసారి కాంబినేషన్ లో చేసిన సినిమాయే సినిమా చూపిస్త మావ. తెలుగు సినిమా హిట్ పెయిర్ నే కాదు, హిట్ ఫార్ములా అయిన మామ, అల్లుడు మధ్య నడిచే రసవత్తరమైన కాంపీటీషన్ ఆధారంగా దర్శకుడు త్రినాథరావు నక్కిన రాసుకున్న కథ ఇది. రావు రమేష్ మామగా నటించడం సినిమాకి హైలైట్ అయిందని విడుదలకు ముందే చాలా మంది అనుకున్నారు. మేం వయసుకు వచ్చాం తర్వాత సరైన విజయాలు అందుకోని దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ సక్సెస్ ఫార్మాలాతో రాసుకున్న కథ ఇది. మరి ఈ సక్సెస్ ఫార్ములా, జోడి సినిమాని ఎంత మేర సక్సెస్ బాట పట్టించాయో చూద్దాం..

కథ

కత్తి(రాజ్ తరుణ్) మాస్ కుర్రాడు. ఇంటర్ పాస్ కావడానికి రెండేళ్లుగా కష్టపడుతూ ఉంటాడు. మెడికల్ ఆఫీసర్ అయిన సోమనాథ్ చటర్జీ(రావు రమేష్) తనయ పరిణీత(అవికాగోర్)ను ఇష్టపడి, ప్రేమించమని వెంటపడి ప్రేమను సాధిస్తాడు. అయితే ప్రతి విషయంలోనూ నాణ్యత ఉండాలనుకునే సోమనాథ్ వీరి ప్రేమకు అంగీకరించడు. ఒకవేళ తన మనససు గెలవాలంటే తను కాచిన పందెంలో గెలవాలనే కండీషన్ పెడతాడు. మరి కత్తి ఆ పందెం గెలిచాడా? సోమనాథ్ కాచిన పందెం ఏంటి? చివరికి కత్తి, పరిణీత ప్రేమను దక్కించుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

సమీక్ష

ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది రాజ్ తరుణ్ గురించి..తన మొదటి చిత్రం ఉయ్యాలా జంపాలాలోని క్యారెక్టర్ కి పూర్తి భిన్నమైన క్యారెక్టర్ లోనటించాడు. మాస్ యాంగిల్ లోని క్యారెక్టర్ లోరాజ్ తరుణ్ బాగా నటించాడు. రవితేజను ఇమిటేట్ చేసినట్టుగా అనిపించాడు. అలాగే అవికా గోర్ చదువుల సరస్వతిగా, లవర్ గా, చక్కని నటను కనపరిచింది. మంచి ఎక్స్ ప్రెషన్స్ ను పలికించింది. సునాయసంగా చేసేసింది. వీరి మధ్య చక్కని కెమిస్ట్రీ కుదిరింది. రావు రమేష్ అక్కడక్కడా ఎక్కువ చేశాడని అనిపించినా, కొద్ది మంది మాత్రమే చేయగలిగే అటువంటి పాత్రకు న్యాయం చేశాడు. రాజ్ తరుణ్ తండ్రిలా నటించిన తోటపల్లి మధు నటన ఆకట్టుకుంది. షకలక శంకర్, పోసాని, సుడిగారి సుధీర్, మెల్కొటి, సహా ప్రతి ఒక్కరూ కామెడి పండించారు. వారు చేసిన కామెడి ప్రయత్నంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. సెకండాఫ్ లోఈ జబర్ దస్త్ బృందం తన కామెడి స్టయిల్ తో ముందుకు నడిపించింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దర్శకుడు త్రినాథరావు నక్కిన, ముందు చెప్పినట్టు అందరికీ తెలిసిన సక్సెస్ ఫార్ములాను కరెక్ట్ గా ప్రజెంట్ చేశాడు. అతనికి ప్రసన్నకుమార్ నుండి పూర్తి సపోర్ట్ లభించింది. శేఖర్ చంద్ర అందించిన సంగీతంలో పిల్లి కళ్ల పాప, హీరో హీరోయిన్ మధ్య నడిచే డ్యూయెట్ సాంగ్ నచ్చుతాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి లుక్ ని తీసుకొచ్చింది. అలాగని సినిమా కొత్తగా ఉందా అంటే సినిమా చూస్తున్నంత సేపు అక్కడా, ఇక్కడా చూసిన విధంగానే ఉంటుంది. ఆంధ్రాపోరి కాన్సెప్ట్ ను కాపీ కొట్టేశారా అనిపించింది. ఫస్టాఫ్ అంతా నార్మల్ గానే సాగిపోయినా సెకండాఫ్ మంచి జోష్ తో సినిమా నడుస్తుంది.

విశ్లేషణ

బేసిక్ థీమ్ ప్రేమను గెలిపించుకోవాలనుకునే యువకుడు, ఆ ప్రేమకు హీరోయిన్ తండ్రి అంటే మావగారు అడ్డు పడటం. ఇప్పటి వరకు ఇలాంటి ఫార్ములా కథలను తెలుగు ప్రేక్షకులు చూసేశారు. అయినా చాలా వరకు సినిమాలు పెద్ద విజయాలను అందుకోవడంతో దర్శకుడు ఇలాంటి కథను ఎంచుకున్నాడు. అయితే ఈ కథను తెరకెక్కించే విషయంలో కామెడికీ పెద్ద పీట వేయడం సినిమాకి బాగా కలిసి వచ్చింది. అత్తారింటికి దారేది చిత్రంలో పవన్, బ్రహ్మానందం, సమంతల మధ్య నడిచే ఆహల్య కథలా, ద్రౌపది సీన్స్ తో, జబర్ దస్త్ టీమ్ పండించిన కామెడి ఆద్యంతం ఆకట్టుకుంది. హీరో మందుకొట్టి కామెడి చేస్తూ చితక్కొట్టే సన్నివేశాలను మనం అల్రెడీ చూసేసినా కామెడితో ఎంటర్ టైన్ చేశారు. కథ పాతదే అయినా కథనం, కామెడితో సినిమా చూపిస్త మావ ఒక కామెడి ఎంటర్ టైనర్ లా ఉంటుంది. అయితే లాజిక్ లు వెతుక్కుంటే మాత్రం ఉన్న కామెడిని ఎంజాయ్ చేయలేం.

బాటమ్ లైన్: కొత్త సీసాలో పాత నీరే అయినా...కామెడి ఎంటర్ టైనర్ సినిమా చూపిస్త మావ'

రేటింగ్: 3/5

English Version Review

More News

జనవరి 8 సంక్రాంతి కానుకగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌.. 'ఆర్య' సుకుమార్‌ చిత్రం

జనవరి 8 సంక్రాంతి కానుకగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌.. ‘ఆర్య’ సుకుమార్‌ చిత్రంకాంబినేషన్‌లో భారీ నిర్మాత

బన్ని వస్తాడట...

అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 గా రూపొందిస్తున్న ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్".

'ఉపేంద్ర 2' మూవీ రివ్యూ

ఉపేంద్ర ఈ పేరుని తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోరు. ఎందుకంటే ఈ సినిమాతో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగునాట కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

రజనీకాంత్ పేరు మారుతుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం అంటేనే స్క్రిప్ట్ వర్క్ నుండి చివరి వరకు సెన్సేషన్ అనే చెప్పాలి.

సెప్టెంబర్ లో 'గుంటూర్ టాకీస్'

నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూర్‌ టాకీస్‌’ ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, నరేష్‌ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన తారాగణంగా నటించారు.