'సినిమా చూపిస్త మావ‌' విశేషాలు

  • IndiaGlitz, [Thursday,August 06 2015]

రాజ్ త‌రుణ్‌, అవికాగోర్ జంట‌గా రూపొందుతున్న సినిమా సినిమా చూపిస్త మావ‌. రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. అంజిరెడ్డి ప్రొడ‌క్స‌న్స్, ఆర్‌.డి.జి.ప్రొడ‌క్ష‌న్స్ ప్రై.లి స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్య‌త్ సినీ ఎంట‌ర్‌టైన్మెంట్స్, ల‌క్కీ మీడియా సంయుక్తంగా రూపొందిస్తున్నాయి.

బెక్కం వేణుగోపాల్‌, రూపేష్ డి.గోహిల్‌, బోగ‌ది అంజిరెడ్డి, జి.సునీత నిర్మాత‌లు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను ఈ నెల 14న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇది ల‌వ్‌స్టోరీ అని, మామా అల్లుళ్ల మ‌ధ్య ఎలాంటి క‌థ న‌డుస్తుంద‌నేదే క‌థ అని రాజ్ త‌రుణ్ చెప్పారు. ఇందులో టీనేజ్ అమ్మాయి పాత్ర చేస్తాన‌ని అవికాగోర్ తెలిపారు.