అంగరంగ వైభవంగా సినీగోయర్స్ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక

  • IndiaGlitz, [Monday,May 14 2018]

49వ సినీ గోయర్స్ అసోసియేషన్ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్ లోని లలితకళాతోరణంలో అంగరంగ వైభవంగా జరిగింది. 2017 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుంచి ఎంపిక చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాల్ని అందజేశారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బిరామిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 49వ ప్రత్యేక సావనీర్ ను ఆయన విడుదల చేశారు. కోనవెంకట్, రేలంగి నరసింహారావు, రోజారమణి, ఈషా, వైజాగ్ ప్రసాద్ తదితరులు గ్రహీతలకు అవార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా సినీగోయర్స్ అధ్యక్షుడు వరదాచారి మాట్లాడుతూ... మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త తరం అభిరుచులకు ప్రాధాన్యతనిస్తూ ఆధునికంగా సినీ గోయర్స్ అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నాం. కొత్త పంథాను అనుసరిస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తూ ముందుకు సాగుతున్నాం. కిషన్ ప్రారంభించిన ఈ స్ఫూర్తిని ఆయన తనయుడు రామకృష్ణ కొనసాగించడం ఆనందంగా ఉంది. అన్నారు.

సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ... ఒకప్పుడు సినిమా నటులను కలవాలన్నా, చూడాలన్నా, కష్టసాధ్యంగా ఉండే రోజుల్లో బి.కిషన్ ఎంతో కృషి చేసి సినీగోయర్స్ సంస్థ ద్వారా వారికి అవార్డులను అందజేశారు. ఆయన వారసత్వాన్ని తనయుడు రామకృష్ణ కొనసాగిస్తిన్నారు. 49 ఏళ్లుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ వేడుకను నిర్వహించడం అభినందనీయం అని అన్నారు.

సినీగోయర్స్ పురస్కారాల్ని తాను అందుకోవడం ఇది పదోసారని గేయరచయిత సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు.

సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ... మహానటి సక్సెస్ ను అందుకున్న తరుణంలోనే మాటల రచయితగా సినీ గోయర్ అవార్జును అందుకోవడం ఆనందంగా ఉంది. గౌతమి పుత్ర శాతకర్ణి టీమ్ కృష్ణి వల్లే ఈ అవార్డును అందుకోగలిగాను. అని అన్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ... సినీ ఇండస్ట్రీకి అంకితమై పనిచేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని గుర్తించి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం ఆనందంగా ఉంది. నిన్ను కోరి నా జీవితంలో చాలా ప్రత్యేకమైన చిత్రం. ఎన్టీయార్, మహేష్ బాబు, నాని, హీరోలందరితో నేను చేసిన తొలి సినిమాలన్నీ విజయవంతమయ్యాయి.

ఆ సెంటిమెంట్ ను ఈ సినిమా మరోసారి నిరూపించింది. 24 విభాగాల్లో స్క్రీన్ ప్లే ముఖ్యమైనదని, స్క్రీన్ ప్లే లేకపోతే ఎంత గొప్ప కథ అయినా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. మరిన్ని మంచి సినిమాలకు పనిచేయడానికి ఈ అవార్డు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు.

తన కెరీర్ లో అందుకున్న తొలి పుస్కారమిదని, మదర్స్ డే రోజున అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని, తల్లితండ్రులు కుటంబసభ్యుల ప్రోత్సాహం వల్లనే ఈ స్థాయికి చేరుకున్నానని సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అన్నారు.

ఈ పురస్కారాన్ని తన తల్లికి అంకితమిస్తున్నట్టు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బి.రామకృష్ణ, శివారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కాళకేయ ప్రభాకర్, వైస్ ఛైర్మన్ డి.వై.చౌదరి, వైజాగ్ ప్రసాద్, కోశాధికారి ఎన్.శ్రీరాములు, కవిత తదితరులు పాల్గొన్నారు.

More News

మహానటి దర్శక, నిర్మాతలను సత్కరించిన అల్లు అరవింద్, అల్లు అర్జున్!

మహానటి ఘన విజయమైన సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ కలిసి ఆదివారం చిత్ర దర్శక నిర్మాతలను సత్కరించారు.

రామ్‌, దిల్‌రాజు 'హ‌లో గురు ప్రేమ కోస‌మే'  ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మాణంలో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'హ‌లో గురు ప్రేమ కోస‌మే'.

నేడే కాశి ప్రీ రిలీజ్ ఈవెంట్

ఆల్ రౌండర్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎక్జాంపుల్ విజయ్ ఆంథోని. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న విజయ్ ఆంటోనీ

'స‌వ్య‌సాచి' యు.ఎస్‌. షెడ్యూల్ పూర్తి

నాగ చైతన్య, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'సవ్యసాచి'. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

నాలుగోసారి అదే హీరోయిన్‌తో బాల‌య్య‌...

నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ య‌న్‌.టి.ఆర్ విష‌యంలో కాస్త స‌మ‌యం తీసుకుంటున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు.