తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం

  • IndiaGlitz, [Monday,September 09 2019]

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం కార్యక్రమంలో చినజీయర్ స్వామి, కృష్ణంరాజు, చిరంజీవి, రాజేశేఖర్, మహేష్ బాబు, కృష్ణ, కోటా శ్రీనివాస్, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్, సురేష్ బాబు, నీహారిక, నాగబాబు, కిషన్ రెడ్డి, రామ్ లక్ష్మణ్, సందీప్ కిషన్, రాశి ఖన్నా, రెజీనా, ప్రగ్యా జస్వాల్, పూజా హెగ్డే, ఎమ్.ఎల్.కుమార్ చౌదరి, గిరిబాబు, శ్రీకాంత్, అశ్వినిదత్, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, టి.సుబ్బిరామిరెడ్డి, సాయి ధరమ్ తేజ్, మారుతి, తనీష్, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

రాఘవేంద్ర రావు మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప ఫంక్షన్ చూడలేదు. మేనేజర్లు చేస్తున్న ఈ ఫంక్షన్ పెద్ద సక్సెస్ దిశగా ముందుకు వెళుతుంది. నేను ఇన్ని గొప్ప సినిమాలు చేయడానికి సహకరించిన అందరూ మేనేజర్స్ కు థాంక్స్ తెలుపుతున్నాను అన్నారు.

గిరిబాబు మాట్లాడుతూ... ప్రొడక్షన్ మేనేజర్లు సర్వీస్ చాలా అమూల్యమైనది. సినిమా కొబ్బరికాయలు కొట్టినప్పటినుంది గుమ్మడికాయ కొట్టేవరుకు వారు సినిమాకు చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటారు. వారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని అన్నారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ... ప్రొడక్షన్ మేనేజర్స్ ఇంత మంచి ఫంక్షన్ చేస్తారని ఊహించలేదు. వారు తలుచుకుంటే సినిమా టైమ్ లో పూర్తి చెయ్యగలగు. తెలుగు పరిశ్రమలో నేను గత 50 ఏళ్ల నుండి ఎంతో మంచి మేనేజర్స్ ను చూసాను. వారు భవిషత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్న అన్నారు.

మహేష్ బాబు మాట్లాడుతూ... ఈ ఫంక్షన్ లో చిరంజీవి గారిని కలవడం కొత్త ఎనర్జిని ఇచ్చింది. మేనేజర్స్ చేస్తున్న ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భవిషత్తులో వారు మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. మేనేజర్లు చేస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమానికి హాజరవ్వడం సంతోషం. నేను 32 సినిమాలు తీసాను కావున 32 లక్షలు మేనేజర్స్ యూనియన్ కు ఇస్తున్నాను. నేను నిర్మించిన మంచి చిత్రాల్లో మేనేజర్స్ సహాయ సహకారాలు ఉన్నాయన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ... అందరికి నమస్కారం. మేనేజర్స్ సిల్వర్ జూబ్లీ రధతోత్సవం ఇంత వైభవంగా జరగడం ఆనందంగా ఉంది. ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు ఎంత కష్టపడతారు, ఎంత శ్రమిస్తారు అనేది నేను చూసాను. సినిమా ఆఫీస్ తీసినప్పటి నుండి అది విడుదల అయ్యే వరకు శ్రమించేది మేనేజర్లు. సినిమా అనే అద్భుతమైన సౌధం అనుకుంటే మేనేజర్లు పునదిరాళ్లు. షూటింగ్ జరుగుతున్న సమయంలో తక్కువ నిద్రపోయేది మేనేజర్లు కావున సినిమా సక్సెస్ లో వారి వంతు చాలా ఉంటుంది. సైరా సినిమా షూటింగ్ కోసం లొకేషన్ మా మేనేజర్ వారి కాళ్ళ మీద పడి అనుమతి తీసుకున్నారు, వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈవెంట్ ను విజయవంతం చెయ్యడానికి అందరూ స్వచ్చందంగా వచ్చాము అన్నారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... ఈ మహోత్సవం ఇంత గ్రాండ్ గా చేసిన మేనేజెర్స్ యూనియన్ కు అభినందనలు. సినిమా ఇండస్ట్రీలోని అతిరథ మహారధులు ఈ ఫంక్షన్ కు రావడం హర్చించదగ్గ విషయం. నేను భవిషత్తులో కూడా చిత్ర పరిశ్రమకు సహాయపడతాను. కుల,మతానికి అతీతంగా ఇండస్ట్రీలో ఉన్నవారందరు ఈ ఫంక్షన్ కు రావడం జరిగింది. భవిష్యత్తు లో వీరు మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ చెయ్యాలని కోరుకుందాం అన్నారు.

More News

పుట్టిరోజు సంద‌ర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేసిన అక్ష‌య్‌

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ నేటితో 52లోకి అడుగు పెట్టారు. వ‌రుస విజ‌యాల‌ను మంచి ఊపు మీదున్న అక్ష‌య్ కుమార్ వ‌రుస సినిమాలను అనౌన్స్ చేస్తూ మంచి విజ‌యాల‌ను సాధిస్తూ..

సైరాపై మ‌హేశ్ కామెంట్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి`. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం.

నాగార్జున కొత్త టాటూకు అర్థ‌మేంటో తెలుసా?

ప్ర‌స్తుతం నాగార్జున బిగ్‌బాస్ 3కి వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ వారం బిగ్‌బాస్‌లో హోస్ట్‌లో నాగార్జున‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.

మా లోకం.. పత్తిగింజనని చెప్పుకుంటారు: విజయసాయి

వైసీపీ ప్రభుత్వం పంచిన ‘సన్న బియ్యం’పై టీడీపీ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. సన్న బియ్యం ప్యాకేట్లు ఓపెన్ చేసినట్లున్న వీడియోలు, ఫొటోలను మాజీ మంత్రి,

‘సాహో’ డైరెక్టర్‌ ఆరోగ్యంపై రూమర్స్.. అసలేం జరిగింది!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. ఆగస్టు-30న విడుదలైన ఈ చిత్రంపై మిక్స్‌డ్ టాక్ వినిపించింది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి సెకండ్ సినిమానే