'సినీమహాల్' ఆడియో రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
కళానిలయ క్రియేషన్స్ పతాకంపై సిద్దాంస్, రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో తెరెక్కిన చిత్రం 'సినీ మహల్'. రోజులు నాలుగు ఆటలు అనేది ఉపశీర్షిక. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌లో నిర్వహించారు. మారుతి థియేట్రికల్ ట్రైలర్, బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...
మారుతి మట్లాడుతూ.. పాటలు బావున్నాయి. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. ''శేఖర్‌చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఫస్ట్ లుక్ నుండి ఏదో ఒక కొత్తదనాన్ని యూనిట్ వారు ట్రై చేస్తున్నారు. అన్ని ఎలిమెంట్స్ కలగలిపిన సినిమా. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్'' అని అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన పార్థు మాట్లాడుతూ.. ''సినిమా తీసేటప్పుడు మా సినిమాకు సినీమహాల్ అని పేరు పెడదామా అని ఆలోచించాం కానీ సినిమా బాగా రావడతంతో ఈ టైటిల్ ను పెట్టాం. ఎందుకంటే సినిమా పరిశ్రమలో ఎవరు ఏ కష్టం పడ్డ ఆ ప్రతిఫలం ప్రేక్షకుడు కూర్చొనే సినిమా హాల్లో తెలిసిపోతుంది. టూరింగ్ టాకీస్‌కు సంబంధించిన సినిమా. హీరో తన ప్రాణాలను పణంగా పెట్టి టాకీస్‌న ఎలా దక్కించుకున్నాడనేదే కథ. ఇప్పటి వరకు రానీ డిఫరెంట్ లైన్‌తో తెరకెక్కించిన చిత్రం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని అన్నారు.
దర్శకుడు లక్ష్మణ్‌వర్మ మాట్లాడుతూ.. ''కళానిలయ కారణంగానే నేనీ రోజు దర్శకుడిగా నిలబడి ఉన్నాను. అందుకు వారికి థాంక్స్. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ నిచ్చారు. సినిమాటోగ్రాఫర్ సినిమాను చక్కగా పిక్చరైజ్ చేశారు. ఆయన వల్లనే సినిమాను అనుకున్న టైంలో పూర్తి చేయగలిగాం. సపోర్ట్ చేసిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ థాంక్స్'' అని అన్నారు.
సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. ''దర్శకుడు మంచి ఎనర్జిటిక్ పర్సన్. చాలా క్లారిటీతో సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకు చేసిన జర్నీను మరచిపోలేను. ఐదు మంది నిర్మాతలు కలిసి సినిమాను ఎక్కడా రాజీ కాకుండా నిర్మించారు. మ్యూజిక్కు తగిన విధంగా మంచి లిరిక్స్ కుదిరాయి'' అని అన్నారు.
హీరో సిద్ధాంశ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, కళానిలయ క్రియేషన్స్ బ్యానర్‌కి థాంక్స్'' అని అన్నారు.
రాహుల్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో అర్జునుడిలాంటి పాత్రను చేశాను. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని రూపొందించారు. ఇందులో మూడు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాను'' అని అన్నారు.
ఈ కార్యక్రమంలోపాల్గొన్న సుద్ధాల అశోక్ తేజ, కృష్ణుడు, వెన్నెలకిషోర్, నందు తదితరులు పాల్గొని చిత్రయూనిట్ ను అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com