YSRCP MPs: వైసీపీ ఎంపీ అభ్యర్థులుగా సినీ ప్రముఖులు.. ఎవరంటే..?
- IndiaGlitz, [Thursday,January 11 2024]
వైసీపీలో మూడో జాబితా ఇంఛార్జ్‌ల మార్పుపై సీఎం జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. మార్పులు చేర్పులు చేయాలనుకున్న నియోజవకర్గాల నేతలను క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని చర్చిస్తున్నారు. ఈ మేరకు మంత్రులు కారుమూరి నాగేశ్వరారవు, జోగి రమేష్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, జక్కంపూడి రాజా క్యాంపు కార్యాలయానికి చేరుకుని పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. నేతలతో చర్చలు పూర్తి కాగానే మూడో జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కొన్ని నియోజకవర్గాలకు వైసీపీ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేల అభ్యర్థులను కూడా ఎంపిక చేసినట్లు ఓ జాబితా మీడియా వర్గాల్లో సర్కిల్ అవుతోంది. ఈ లిస్టులో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు చోటు దక్కడం విశేషం.
ఎంపీ అభ్యర్థులు వీరే..
కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం, రాజమండ్రీ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డైరెక్టర్ వి.వి.వినాయక్, విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మజ్జి శ్రీనివాస్, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చలమ శెట్టి సునీల్, నంద్యాల వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సినీ నటుడు ఆలీ, విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి, నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నాగార్జున యాదవ్, అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఎలిజా, అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కిలారు పద్మ, నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు ఖరారైనట్లు సమాచారం.
ఎమ్యెల్యే అభ్యర్థులు వీరే..
ఇక చింతలపూడి నియోజకవర్గం ఇంచార్జ్‌గా విజయరాజు, ఆలూరు ఇంచార్జ్‌గా విరుపాక్షి, చిత్తూరు ఇంచార్జ్‌గా విజయ ఆనంద రెడ్డి, గూడూరు ఇంచార్జ్‌గా మేరుగ మురళి, మార్కాపురం ఇంచార్జ్‌గా జంకె వెంకట్ రెడ్డి, దర్శి ఇంచార్జ్‌గా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, నందికొట్కూర్ ఇంచార్జ్‌గా గంగాధర్, పెందుర్తి అభ్యర్థిగా అదిప్ రాజ్, నెల్లూరు ఇంచార్జ్‌గా కృపాలక్ష్మి, రాయదుర్గం అభ్యర్థిగా మెట్టు గోవిందర రెడ్డి, మడకశిర అభ్యర్థిగా శుభకుమార్ పేర్లను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
బుధవారం రాత్రి మూడో జాబితా విడుదలకావాల్సి ఉన్నా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రాకపోవడంతో చివరి నిమిషంలో వాయిదా వేశారు. సంక్రాంతి పండుగ లోపు కానీ తర్వాత కానీ మూడో జాబితాను విడుదల చేసే అవకాశముంది. కాగా ఇప్పటికే విడుదల రెండు జాబితాల్లో 38 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డికి టికెట్ నిరాకరించగా.. మరికొంతమంది మంత్రులకు స్థాన చలనం కల్పించారు. మరి మూడో జాబితాలో ఎంతమందికి ఉద్వాసన పలుకుతారో..? వేరే చోటకు మారుస్తారో..? వేచి చూడాలి.