సినీ ఆర్టిస్టుల వేతనాల్లో కోత
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి నుంచి క్రమక్రమంగా కోలుకుంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే తిరిగి పనిని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను క్రమబద్దీకరించుకోవడంలో భాగంగా థియేటర్లను తెరిచేందుకు అనుమతించింది. ఇక మన ముందు చాలా సవాళ్లున్నాయి.
థియేటర్లలో ఆక్యుపెన్సీ పరమైన అనిశ్చితి
50 శాతం మాత్రమే అనుమతి
ఫారిన్ థియేట్రికల్ మార్కెట్‌కు అవకాశం లేదు
రెవెన్యూ పరమైన అడ్డంకులు
పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకూ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మన పనిని తిరిగి ప్రారంభించి మనం నిలదొక్కుకోగలగాలి.
ఇండస్ట్రీలోని అన్ని విభాగాలు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు. కష్ట సమయాల్లో అన్ని సవాళ్లనూ ఎదుర్కొంటూ ముందుండేది ఆర్టిస్ట్ కమ్యూనిటి. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌తో చర్చల అనంతరం త్వరలోనే ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయని మేము భావిస్తున్నాం.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్ ముందున్న రెమ్యూనరేషన్లపై 20 శాతం తగ్గింపునకు అంగీకరించింది.
రోజుకు 20 వేల లోపు రెమ్యునరేషన్ తీసుకునే కళాకారులకు ఈ తగ్గింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
సాంకేతిక నిపుణులకు సంబంధించి, ప్రతి చిత్రానికి రూ.5 లక్షలకు పైగా పారితోషికం తీసుకునే వ్యక్తులకు 20 శాతం తగ్గింపు వర్తిస్తుంది.
మన మధ్య బంధం ఎప్పటికీ కొనసాగేందుకు అందరూ సహకరిస్తారని భావిస్తున్నాం. పరిస్థితులు అనుకూలించిన వెంటనే రెమ్యూనరేషన్‌ను తిరిగి సమీక్షిస్తాం. మన మధ్య కుదిరిన ఈ ఒప్పందం అందరు నిర్మాతలు, కళాకారులు, సాంకేతిక నిపుణులకు వర్తిస్తుంది. అందరి సహకారంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీని వీలైనంత తొందరగా తిరిగి పునరుద్ధరించుకుందాం.
ఈ కష్ట సమయాల్లో ఒకరికొకరు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments