Margadarshi:మార్గదర్శి మేనేజర్‌ను తీసుకెళ్లిన దర్యాప్తు బృందం .. దొరకని ఆచూకీ, సిబ్బందిలో ఆందోళన
Send us your feedback to audioarticles@vaarta.com
విజయవాడ లబ్బీపేట మార్గదర్శి బ్రాంచి మేనేజర్ బి. శ్రీనివాసరావును గురువారం దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారో మాత్రం సమాచారం ఇవ్వలేదు. కృష్ణలంక పోలీసులు వచ్చి శ్రీనివాసరావును తీసుకెళ్లినట్లుగా .. ఆయన సహాయకులు చెబుతున్నారు. కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాసరావు లేరు. మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయానికి గానీ.. లేక సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయానికి తరలించారా అన్నది తెలియరాలేదు.
మార్గదర్శి వ్యవహారంలో సీఐడీ దూకుడు :
ఇదిలావుండగా.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి సంస్థలో డిపాజిట్లు చేసిన వారికి గతవారం నోటీసులు జారీ చేసింది. రూ.కోటికి పైగా మొత్తాన్ని డిపాజిట్ చేసిన వారిపై సీఐడీ ఫోకస్ పెట్టింది. రూ.20 వేలకు మించి డిపాజిట్లు తీసుకునే అధికారం మార్గదర్శికి లేకపోవడంతో పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసిన కోటీశ్వరులందరికీ నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.
మార్గదర్శిలో రూ.కోటికి పైగా వున్న డిపాజిట్లపై ఆరా :
రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలను సీఐడీ వెలికి తీస్తోంది. మార్గదర్శిలో ఇప్పటికే మూసివేసిన 23 చిట్ గ్రూపులతో పాటు మరికొన్ని గ్రూపుల్ని మూసివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అంతేకాదు చిట్టీల నిర్వహణను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మార్గదర్శిలో రూ. కోటికి పైగా డిపాజిట్ల చేసిన వారిని గుర్తించే పనిలో వున్నారు. వీరంతా డిపాజిట్ల ముసుగులో బ్లాక్ మనీ నిల్వ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లను వసూలు చేయకూడదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 37 ప్రాంతాల్లో వున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో రశీదుల పేరిట డిపాజిట్ చేసిన వారి వివరాలను సీఐడీ ఇప్పటికే సేకరించింది. వారి వృత్తి, వ్యాపారాలు, ఆదాయ మార్గాలు, ఇతర వివరాలతో సీఐడీ అధికారులు ఇప్పటికే నివేదిక రూపొందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout