Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు సీఐడీ అధికారులు

  • IndiaGlitz, [Tuesday,November 21 2023]

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం తీర్పును సుప్రీంకోర్టులో సీఐడీ అధికారులు సవాల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళ(మంగళవారం) సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాగా చంద్రబాబు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించిన విషయం విధితమే. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆయనకు పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు తీర్పు వెల్లడించారు. దీంతో ఈ నెల 28న రాజమండ్రి జైలులో సరెండర్ కావాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 17న వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.

మరోవైపు స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పైనా సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉంది. మరో రెండు రోజుల్లో తీర్పు రానుంది. దీంతో ఈ తీర్పు కూడా తమకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కేసులో అవినీతి చేశారని ఆరోపిస్తూ సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసింది. అనంతరం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 52రోజల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. గత నెల 31న హైకోర్టు ఆయనకు అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

More News

Telangana Elections: తనిఖీల్లో రూ.1760కోట్లు పట్టివేత.. తెలంగాణలోనే అత్యధికం..

ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నగదు, మద్యం ఏరులైపారుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు.

ఫిషింగ్ హార్బర్ బాధితులకు అండగా సీఎం జగన్.. భారీగా పరిహారం ప్రకటన

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారు. ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు భారీ సాయాన్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Aadikeshava:ఊర మాస్‌గా మెగా హీరో.. 'ఆదికేశవ' ట్రైలర్ రిలీజ్..

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆదికేశవ' నుంచి ట్రైలర్ విడుదలైంది. లవ్, రొమాన్స్, కామెడీ,

Trisha:త్రిష గురించి మన్సూర్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం

హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Ali Khan) చేసిన వ్యాఖ్యలు దేశవ్యా్ప్తంగా పెను దుమారం రేపుతున్నాయి.

Kodali Nani:నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. టీడీపీకి కొడాలి నాని ఛాలెంజ్..

గుడివాడ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ పకోడీగాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని