రంగనాయకమ్మపై సీఐడీ కేసు.. అసలేం జరిగింది!?

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ఏపీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకున్నదో.. నష్ట పరిహారం ఎన్నిరోజుల్లో ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఘటన జరిగిన రోజే చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయిలు, ఆ తర్వాత చికిత్స పొందుతున్న వారికి అలా నష్టపరిహారం ప్రకటించి.. వారం తిరగక ముందే వారికి అందేలా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. అయితే.. ఈ విషయంలో ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విశాఖ జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు పూందోట రంగనాయకమ్మ రాసుకొచ్చారు. దీంతో ఆమెపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. కాగా 41-ఏ కింద సీఐడీ రంగానాయకమ్మకు నోటీసులిచ్చింది. ఇదే రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 15 లక్షలు జరిమానా విధించే అవకాశాలు మెండుగా వ్యక్తం చేస్తున్నారు.

ప్రశ్నిస్తే బెదిరిస్తారా!?

ఆమెపై కేసు నమోదు చేయడానికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరోవైపు వృద్ధురాలిపై కేసు నమోదు చేయడం పట్ల ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రంగనాయకమ్మను మాజీ మంత్రి, టీడీపీ నేత ఆలపాటి రాజా పరామర్శించారు. విశాఖ గ్యాస్ దుర్ఘటనపై రంగనాయకమ్మకు సీఐడీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. ఒక సాదారణ మహిళా తన అభిప్రాయం చెబితే కేసులు పెడతారా..? ఎల్జీ ప్రమాద ఘటనపై ప్రశ్నిస్తే కేసులతో బెదిస్తారా..? వైసీపీ ప్రభుత్వంలో పౌరులకు భావవ్యక్తికరణ స్వేచ్చ లేదా..? అని ప్రభుత్వంపై ఆలపాటి ప్రశ్నల వర్షం కురిపించారు. పాలీమర్ ఘటనపై తప్పు కప్పిపుచ్చుకునేందుకే సాధారణ పౌరులపై కేసులు నమోదు చేస్తున్నారని.. ఇలాంటి చర్యలను ప్రజా స్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలని ఆలపాటి రాజా వ్యాఖ్యానించారు.

నాకే ఆశ్చర్యమేసింది!

కాగా ఈ నోటీసులపై రంగనాయకమ్మ స్పందించారు. ‘విశాఖ ప్రమాదంపై నా అభిప్రాయాన్ని మాత్రమే షేర్ చేశాను. ప్రభుత్వాన్ని ఉద్దేశ్యపూర్వకంగా విమర్శించలేదు. సీఐడీ నోటీసులు ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయాను. అంతిమంగా విశాఖ బాధితులకు న్యాయం జరగాలన్నది నా ఆకాంక్ష’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా.. వృద్దురాలిపై సోషల్ పోస్టుల కేసు నమోదు చేయడంతో నగరవాసులు విస్మయానికి గురవుతున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో..? ఈ నేరం రుజువైతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

More News

నందమూరి బాలయ్యపై చార్మీ కామెంట్స్..

నందమూరి బాలకృష్ణపై నటి కమ్ నిర్మాత చార్మీ కామెంట్స్ చేసింది. ఇటీవలే తాను ఇక నటించనని.. ఇది వందకు రెండొందల శాతం పక్కా అని చెప్పిన

జూన్ 8 నుంచి పది పరీక్షలు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. జూన్-08 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

విరాట్ కోహ్లి బ‌యోపిక్‌.. కండీష‌న్ అప్లై

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ హ‌వా న‌డుస్తోంది. పలు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖ వ్య‌క్తుల జీవిత చ‌రిత్ర‌ల‌ను సినిమాల రూపంలో మ‌లుస్తున్నారు.

సినీ ఇండ‌స్ట్రీ గురించి రామ్ ట్వీట్‌

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప‌లు రంగాల్లో సినీ పరిశ్ర‌మ ముందు వ‌రుస‌లో ఉంది. థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టం, షూటింగ్స్ లేక‌పోవ‌డం వంటి కార‌ణాలతో సినీ ప‌రిశ్ర‌మ స్తంభించింది.

టాలీవుడ్‌కు మళ్లీ షాకిచ్చిన కేసీఆర్.. ఆశలు ఆవిరి!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న కష్టకాలంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న విషయం విదితమే. ఇప్పటికే మూడు లాక్ డౌన్‌లు పూర్తవ్వగా.. 4.0 మే-18 నుంచి మే-31వరకు ఉండనుంది.